News October 15, 2025

KMR: పేకాటపై ఉక్కుపాదం.. 18 మంది అరెస్ట్

image

కామారెడ్డి జిల్లాలో మంగళవారం పోలీసులు మూడు వేర్వేరు ప్రాంతాల్లోని పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి 18 మందిని అరెస్ట్ చేశారు. పిట్లం మండలం చిల్లర్గిలో 9 మందిని అరెస్ట్ చేసి రూ.4,030 నగదు, 6 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నస్రుల్లాబాద్ మండలంలో ఐదుగురిని పట్టుకొని రూ.1,250 నగదు, 4 ఫోన్లు, 2 బైకులు స్వాధీనం చేసుకోగా లింగంపేట్ మండలంలో నలుగురిని అదుపులోకి తీసుకోని రూ.6,400 పట్టుకున్నారు.

Similar News

News October 15, 2025

HYD: రౌడీషీటర్ నవీన్‌రెడ్డి నగర బహిష్కరణ

image

రాచకొండ పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. నల్గొండకు చెందిన రౌడీషీటర్ కొడుదుల నవీన్ రెడ్డిపై రాచకొండ సీపీ సుధీర్ బాబు నగర బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. దాడులు, హత్యాయత్నం, బెదిరింపుల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాడన్న కారణంగా అధికారులు 6 నెలల బహిష్కరణ ప్రతిపాదన తీసుకురాగా సీపీ ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన ప్రస్తతం అబ్దుల్లాపూర్‌మెట్ పరిధి మన్నెగూడలో ఉంటున్నాడు.

News October 15, 2025

జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరు ఖరారైంది. కీర్తీ రెడ్డి, పద్మా వీరపునేని, ఆలపాటి లక్ష్మీనారాయణ, ఆకుల విజయ, కొంపల్లి మాధవి టికెట్ కోసం పోటీ పడ్డా చివరికి దీపక్‌ వైపే అధిష్ఠానం మొగ్గు చూపింది. కాగా 2023 ఎన్నికల్లోనూ దీపక్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.

News October 15, 2025

ఇక సెలవు.. ఆయుధం వదిలిన ‘అడవిలో అన్న’

image

మావోయిస్టు పార్టీలో ఓ శకం ముగిసింది. 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి టాప్ కమాండర్ మల్లోజుల వేణుగోపాల్ సెలవు పలుకుతూ జనజీవన స్రవంతిలో కలిశారు. 1981లో అజ్ఞాతంలోకి వెళ్లి ఏటూరునాగారం దళ సభ్యుడిగా ఆయుధం చేతబట్టారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1993లో DKS జడ్పీ సభ్యుడిగా, 1995లో కేంద్ర కమిటీ సభ్యుడిగా, 2007లో పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమితులయ్యారు. 4 దశాబ్దాల్లో ఎన్నో ఎన్‌కౌంటర్లకు నాయకత్వం వహించారు.