News March 16, 2025
KMR: పేదరికాన్ని జయించాడు. సర్కార్ నౌకరి సాధించాడు

గాంధారి మండలం నేరాల తాండకు చెందిన బర్దవాల్ మెగరాజ్ ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికై పలువురికి ఆదర్శంగా నిలిచాడు. పేదరికంలో పుట్టి పెరిగిన మెగరాజ్ ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ కష్టపడి ప్రభుత్వ అధ్యాపకుడిగా ఉద్యోగం సాధించాడు. ఇప్పుడు దోమకొండలో ప్రభుత్వ కళాశాలలో చరిత్ర అధ్యాపకుడిగా బాధ్యతలు స్వీకరించాడు. కాగా మెగరాజ్ ప్రభుత్వ పాఠశాల, కళాశాలలోనే విద్యనభ్యసించాడు.
Similar News
News March 16, 2025
ధర్పల్లి: హోన్నాజీపేట్‌లో బీర్ సీసాతో కొట్టి చంపారు..!

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హోన్నాజిపేట్ గ్రామంలో పాలెం నడిపి మల్లయ్య (55) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడిని భార్య, కొడుకు కలిసి శనివారం రాత్రి చంపేశారని అనుమానిస్తున్నారు. మల్లయ్య తలపై కొడుకు మధు బీరు సీసాతో దాడి చేసి గొంతు నులిమి హత్య చేయగా అందుకు మల్లయ్య భార్య లక్ష్మి సహకరించినట్లు తెలిసింది. ఈ విషయం ఆదివారం ఉదయం వెలుగు చూసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 16, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీని కలిసిన కాంగ్రెస్ నాయకులు

రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ బి.గీతేను ఆదివారం కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి మొక్కను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు కో కన్వీనర్ కనిమేని చక్రధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ సత్తు శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి రాజేశ్వర్ రావు, పొన్నం లక్ష్మణ్ గౌడ్, తిరుపతి యాదవ్, తిరుపతి ఉన్నారు.
News March 16, 2025
ఆదోనిలో ‘గరివిడి లక్ష్మి’ సినిమా షూటింగ్

ఆదోనిలోని ఒకటో వార్డు చిన్నశక్తి గుడి ఆవరణలో శనివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు ‘గరివిడి లక్ష్మి’ సినిమా షూటింగ్ జరిగింది. షూటింగ్‌ను తిలకించడానికి జనాలు ఎగబడ్డారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒకటో పట్టణ పోలీసులు బందోబస్తు కల్పించారు. గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జే.ఆదిత్య కెమెరామెన్ కాగా, చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు.