News July 5, 2025
KMR: పేలుడు పదార్థాల పట్టివేత.. నలుగురి అరెస్ట్

కామారెడ్డిలో శుక్రవారం పేలుడు పదార్థాలను పోలీసులు పట్టుకున్నారు. ASI చైతన్య రెడ్డి వివరాలు.. కేపీఆర్ కాలనీలో శ్రీధర్‌కు చెందిన ప్లాట్‌లో బండరాళ్లను బ్లాస్టింగ్ చేస్తున్నారన్న సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో నలుగురిని అదుపులో తీసుకొని వారి నుంచి 1,564 జిలెటిన్ స్టిక్స్, 41 డిటోనేటర్లు, 16 కార్డెక్స్ వైర్ బండిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ వెల్లడించారు.
Similar News
News July 5, 2025
నిర్మల్: అటవీ గిరిజన ప్రాంతాలకు మౌలిక సదుపాయాల కల్పన

జిల్లాలోని మారుమూల అటవీ, గిరిజన ప్రాంతాల ప్రజలకు రవాణా, మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి అటవీ కమిటీ (DLC) సమావేశం నిర్వహించారు. మొత్తం 16 రహదారి ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించగా, అందులో 9 ప్రాజెక్టులకు అనుమతులు మంజూరయ్యాయని, మిగతా 7 ప్రాజెక్టుల నివేదికలు వాయిదా పడ్డాయని పేర్కొన్నారు.
News July 5, 2025
కడప: భార్యను హత్యచేసిన భర్త.. జీవిత ఖైదు

కడప తాలూకా PS పరిధిలోని ఏఎస్ఆర్ నగర్‌లో ఉండే ముద్దాయి మల్లికార్జునకు జీవిత ఖైదీతోపాటు రూ.లక్షా 60వేల జరిమానాను విదిస్తూ కడప ఏడవ ఏడిజే కోర్టు జడ్జి రమేశ్ శుక్రవారం తీర్పునిచ్చారు. కడపకు చెందిన యువతి గంగాదేవితో మల్లికార్జునకు 2012లో వివాహమైంది. అప్పటినుంచి ఆమెపై అనుమానంతో చంపేస్తానంటూ బెదిరించేవాడు. ఈ క్రమంలో 03/03/2019లో ఆమె గొంతు నులిమి హత్య చేసినందుకు గాను శిక్ష పడింది.
News July 5, 2025
SKLM: ‘SC ఇంటర్ విద్యార్థులకు అకౌంట్లోకి తల్లికి వందనం’

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశం పొందిన ఎస్సీ కులాలకు చెందిన విద్యార్థులకు నేరుగా అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు జమ అవుతాయని జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుండ్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025 -26 విద్యా సంవత్సరంలో కాలేజీలో జాయిన్ అయి, వారి బ్యాంక్ అకౌంటుకు NPCI లింకు చేయాలని పేర్కొన్నారు. బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ లో వ్యక్తిగత ఖాతా ఓపెన్ చేయాలని తెలిపారు.