News February 18, 2025
KMR: పోలీసులకు డ్రైవింగ్ నైపుణ్యత చాలా ముఖ్యం: ఎస్పీ

అత్యవసర విభాగంలో పని చేసే పోలీసులకు డ్రైవింగ్ నైపుణ్యత చాలా ముఖ్యమని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. జిల్లా పోలీసు శాఖలో ఇటీవల 189 మంది నూతన పోలీస్ కానిస్టేబుళ్లు చేరారన్నారు. సివిల్ కానిస్టేబుళ్లు 115, ఆర్మ్డ్ రిజర్వు కానిస్టేబుళ్లు 74 మంది ఉన్నారన్నారు. వీరందరికీ అత్యవసర పరిస్థితుల్లో డ్రైవింగ్ రావాలనే ఉద్దేశంతో ఆరు వారాల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
Similar News
News September 18, 2025
అర్హులైన వారెవరికీ పెన్షన్లు తొలగించలేదు: మంత్రి

AP: రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తోందని శాసనమండలిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అర్హులైన వారెవరికీ పెన్షన్లు తొలగించలేదని, నోటీసులు అందిన వారికి 2 నెలల్లో వెరిఫికేషన్ పూర్తిచేయాలని వైద్యశాఖకు చెప్పామన్నారు. లబ్ధిదారులు చనిపోతే వారి ఫ్యామిలీలో మరొకరికి పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. 50-59 ఏళ్ల వయసున్న వారిలో 11.98 లక్షల మంది పెన్షన్ పొందుతున్నారని చెప్పారు.
News September 18, 2025
ఇది కోట ‘కుక్కల’ బస్టాండ్..!

గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఇటీవల కుక్కల బెడద ఎక్కువైంది. గుంపులు గుంపులుగా తిరుగుతూ మనుషులను భయపెడుతున్నాయి. దీనికి పైఫొటోనే నిదర్శనం. తిరుపతి జిల్లా కోటలోని RTC బస్టాండ్ లోపల ఇలా పదుల సంఖ్యలో కుక్కలు దర్శనమిచ్చాయి. ఇక్కడ సమయానికి బస్సులు వస్తాయో లేదో తెలియదు గానీ రాత్రి అయితే కుక్కలు ఇలా వచ్చేస్తాయి. పగటి పూట రోడ్లపై వెళ్లే వారిపై దాడులు చేస్తూ కరుస్తున్నాయి.
News September 18, 2025
వికారాబాద్: RTCలో ఉద్యోగాలు

గ్రామీణ యువకులు ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ రామకృష్ణ అన్నారు. ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు. 1000 డ్రైవర్లు, 743 శ్రామిక్ పోస్టులకు అక్టోబర్ 8 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని, అక్టోబర్ 28 వరకు గడువు ఉంటుందని వివరించారు. మరిన్ని వివరాలకు www.tgprb.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన సూచించారు.