News February 7, 2026
KMR: ప్రచారానికి మిగిలింది మూడు రోజులే!

కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి 3 రోజుల్లో తెరపడనుంది. సోమవారం సాయంత్రం 5గం.లోపు బరిలోని అభ్యర్థులు ప్రచారాన్ని ముగించాల్సి ఉంటుంది. కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో అనుకున్న స్థాయిలో ప్రచారం జరగలేదనేది ఆయా వార్డుల్లో ప్రజలు చర్చించుకుంటున్నారు. సైలెంట్ ఓటింగ్‌పైనే అభ్యర్థులు ఆధారపడ్డట్లు కనిపిస్తుంది. సిట్టింగ్లు బెట్టుగా గెలవాలనే ఉత్సాహంలో ఉన్నారు.
Similar News
News February 14, 2026
చిప్పగిరి మండలంలో విషాదం

చిప్పగిరి మండలం నంచర్లలో విషాదం చోటుచేసుకుంది. గుడిసె సావిత్రి(34) అనారోగ్యంతో మనస్తాపానికి గురై పురుగు మందు మాత్రలు మింగినట్లు పోలీసులు తెలిపారు. భర్త గమనించి ఆమెను ముందుగా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారన్నారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
News February 14, 2026
సత్తా చాటిన పొన్నం.. ప్రభావం చూపని బండి సంజయ్

మంత్రి పొన్నం ప్రభాకర్ సొంత నియోజకవర్గమైన హుస్నాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 20 వార్డులకు గాను 16 స్థానాలను కైవసం చేసుకుని కాంగ్రెస్ రికార్డు విజయం సాధించింది. బీఆర్‌ఎస్ 4 స్థానాలకే పరిమితం కాగా, బీజేపీ కనీసం ఒక్క సీటు గెలవలేకపోయింది. కేంద్రమంత్రి బండి సంజయ్ స్వయంగా ప్రచారం చేసినా బీజేపీ ఖాతా తెరవకపోవడం గమనార్హం. పొన్నం చరిష్మా ముందు విపక్షాలు వెలవెలబోయాయి.
News February 14, 2026
T20 WC: ఇవాళ తొలి ఎలిమినేషన్!

T20 WC-2026లో ఇవాళ 3 మ్యాచులు జరగనున్నాయి. తొలి మ్యాచు(11am) ఐర్లాండ్, ఒమన్ మధ్య జరగనుండగా ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించే అవకాశముంది. ఇరు జట్లు ఆడిన 2 మ్యాచుల్లోనూ ఓడటమే దీనికి కారణంగా ఉంది. అటు రెండో మ్యాచ్ ఇంగ్లండ్vsస్కాట్లాండ్(3pm), మూడో మ్యాచ్(7pm) న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరగనుంది. ఈ రెండు మ్యాచుల ఫలితాలు పాయింట్ల పట్టికలో ఆయా జట్ల స్థానాలను ప్రభావితం చేయనున్నాయి.


