News December 17, 2025

KMR: ప్రశాంతంగా పోలింగ్: 56.71 శాతం నమోదు

image

కామారెడ్డి జిల్లాలో జరుగుతున్న మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మండలాల వారీగా పరిశీలిస్తే, అత్యధిక పోలింగ్ శాతం పెద్ద కొడప్గల్ (64.40%) డోంగ్లి (63.57%) మండలాల్లో రికార్డయింది. ఇతర మండలాల్లో బాన్సువాడ (57.55%), బిచ్కుంద (61.78%), బీర్కూర్ (51.13%), జుక్కల్ (52.25%), మద్నూర్ (53.37%), నసురుల్లాబాద్ (55.82%) శాతం పోలింగ్ నమోదైంది.

Similar News

News December 18, 2025

GDDPలో మొదటి స్థానంలో విశాఖపట్నం

image

జిల్లా స్థూల ఉత్పత్తి (జీడీడీపీ)లో విశాఖ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి అర్ధ సంవత్సరంలోని (ఏప్రిల్-సెప్టెంబరు) జీడీడీపీ లెక్కల ఆధారంగా ఆయా జిల్లాల ర్యాంకులను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 59,557 కోట్ల జీడీడీపీతో విశాఖ తొలి స్థానంలో నిలిచింది. అనకాపల్లి జిల్లా జీడీడీపీ రూ.30,189 కోట్లు కాగా.. రూ.6646 కోట్లతో అల్లూరి జిల్లా చివరి స్థానంలో ఉంది.

News December 18, 2025

కేంద్ర రైల్వే మంత్రితో ఎంపీ చిన్ని భేటీ

image

విజయవాడ పార్లమెంటు పరిధిలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధిపై ఎంపీ కేశినేని శివనాథ్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరితో పాటు కలిశారు. గొల్లపూడిలో శాటిలైట్, హాల్ట్ రైల్వే స్టేషన్ ఏర్పాటు, కొండపల్లి, విజయవాడ రైల్వే ట్రాక్ వెంట నీటి నిల్వ సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.

News December 18, 2025

MBNR: సర్పంచ్ ఎన్నికలు.. రూ.11,08,250 సీజ్

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో భాగంగా చేపట్టిన తనిఖీలు, నిఘా చర్యలలో రూ.11,08,250 నగదును సీజ్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ డి.జానకి వెల్లడించారు. అదేవిధంగా రూ.6,93,858 విలువగల మద్యం కేసులకు సంబంధించి 81 ఎక్సైజ్ కేసులు నమోదు చేసి 1050.23 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.