News April 14, 2025

KMR: ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజీ-22 పనులు చేపట్టాలి: షబ్బీర్ అలీ

image

ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజీ-22 పనులు చేపట్టాలని, భూసేకరణ నిధులు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కోరారు. ఆదివారం ఎర్రమంజిల్లోని జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నీటిపారుదల శాఖ సమీక్ష జరిగింది. ఉమ్మడి NZB జిల్లాకు చెందిన రిజర్వాయర్, ప్రాజెక్టుల పెండింగ్ పనులు, మరమ్మత్తులపై మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు షబ్బీర్ అలీ పేర్కొన్నారు.

Similar News

News February 28, 2026

NZB: అర్ధరాత్రి తల్లిని కాల్చి చంపాడు!

image

నిజామాబాద్ జిల్లా కోటగిరిలో అత్యంత కిరాతక ఘటన జరిగింది. మద్యం మత్తులో ఓ కొడుకు కన్నతల్లిని ప్రాణాలతో ఉండగానే తగలబెట్టి హత్య చేశాడు. స్థానికుల వివరాలు.. బ్రాహ్మణగల్లికి చెందిన మానాజీ మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం రాత్రి తల్లి భూమవ్వపై దాడి చేసి ప్రాణాలతో ఉండగానే ఇంట్లోని పాత బట్టలు వేసి నిప్పు పెట్టి కాల్చి చంపాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 28, 2026

వరంగల్: ఇద్దరు సీఐలపై వేటుకు రంగం సిద్ధం?

image

వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో పని చేస్తున్న ఇద్దరు ఎస్‌హెచ్‌వోలపై సస్పెన్షన్ వేటుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. నగరంలో పని చేస్తున్న ఇద్దరు అధికారులు సివిల్ తగాదాల్లో తలదూర్చి, భారీగా డబ్బులు తీసుకున్నట్టు ఫిర్యాదులు రావడంతో వారిపై విచారణ జరిపినట్టు సమాచారం. ఇప్పటికే ఇద్దరి అధికారులపై స్థానిక ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేయడంతో వారిపై చర్యలకు ఉపక్రమిస్తున్నట్టు తెలిసింది.

News February 28, 2026

పాక్-అఫ్గాన్ మధ్య అసలు గొడవేంటి?

image

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య దశాబ్దాల గొడవలకు 1893 నాటి ‘డ్యూరాండ్ లైన్’ సరిహద్దు ఒప్పందమే మూలం. పష్తూన్ ప్రజలను రెండుగా విడగొట్టిన ఈ రేఖను తాము గుర్తించబోమని అఫ్గాన్ మొదటి నుంచీ వాదిస్తోంది. దీనికి తోడు ఇస్లామిక్ పాలనే లక్ష్యంగా పాక్‌లో విధ్వంసం సృష్టించే ‘Tehreek-e-Taliban Pakistan’ ఉగ్రవాదులకు అఫ్గాన్ గడ్డపై ఆశ్రయం లభిస్తోందని పాక్ ఆరోపిస్తోంది. ఇవే ఇరు దేశాల మధ్య గొడవలకు ప్రధాన కారణాలు.