News April 25, 2025
KMR: ప్రియుడితో కలిసి భర్తను చంపింది

రామారెడ్డి PSలో ఏడాది క్రితం మిస్సైన కేసును పోలీసులు చేధించారు. ASP చైతన్యరెడ్డి వివరాలిలా.. ఇస్సన్నపల్లి వాసి తిరుపతి భార్య మనెవ్వకు లింబయ్యతో అక్రమ సంబంధం ఏర్పడిందని తేలింది. తిరుపతి అడ్డుగా ఉన్నాడని లింబయ్య మరో ఇద్దరితో కలిసి తిరుపతిని మందు తాగుదాం అని చెప్పి డొంకల్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అనంతరం హత్య చేసి పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు.
Similar News
News April 25, 2025
మరో రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు

బానుడి భగభగలతో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. శుక్రవారం నుంచి రెండు రోజులపాటు వడగాల్పులు, రాత్రి వేళలో అధిక ఉష్ణోగ్రతల వల్ల వేడి వాతావరణం నమోదవుతుందని జిల్లా వాతావరణం శాఖ తెలిపింది. కాగా గురువారం నారాయణపురంలో 43.1 అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. గుండాల 42.8, రామన్నపేట 42.7, బీబీనగర్, చౌటుప్పల్ 42, మోత్కూర్ 41.7, వలిగొండ 41.5 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News April 25, 2025
మావోల వేట.. కర్రె గుట్టల్లో తూటాల మోతలు

ములుగు జిల్లాలోని కర్రె గుట్టల్లో మావోలు ఉన్నారనే సమాచారంతో మూడు రోజులుగా పోలీసులు గుట్టలను చుట్టుముట్టిన విషయం తెలిసిందే. దాదాపు 300 కి.మీ విస్తరించి ఉన్న కర్రెగుట్టల్లో 3వేలకు పైగా భద్రతా బలగాలు మోహరించినట్లు సమాచారం. కాల్పుల్లో ఇప్పటికే పలువురు మావోలు చనిపోయినట్లు తెలుస్తోంది. వెంకటాపురం, వాజేడు, అలుబాక టేకులగూడెం, తిప్పాపురానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఈ కర్రె గుట్టలు ఉన్నాయి.