News October 28, 2025

KMR: ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్..దరఖాస్తు చేసుకోండి

image

కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అందించే ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకానికి నిధులు మంజూరయ్యాయి. అర్హులైన వారు tgepass.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుక బడిన తరగతుల అభివృద్ధి అధికారి పేర్కొన్నారు. దరఖాస్తు పత్రాన్ని సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సమర్పించాలని కోరారు.

Similar News

News October 29, 2025

తీరం దాటిన తర్వాత కూడా మొంథా తుఫాన్ ప్రభావం: CM

image

AP: తీరం దాటిన తర్వాత కూడా మొంథా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని CM CBN అన్నారు. ఈదురు గాలులతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన చోట వెంటనే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాధితులకు తక్షణ సాయం అందేలా చూడాలని, స్థానిక పరిస్థితులను ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు.

News October 29, 2025

కాగజ్‌నగర్: ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట మోసం.. వ్యక్తి అరెస్ట్

image

స్టాక్స్, ఐపీఓ ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట ప్రజలను మోసం చేసిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశామని కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదోద్దీన్ మంగళవారం తెలిపారు. నిందితుడు స్టాక్స్, ఐపీఓ ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసి 108 మందిని అందులో చేర్చి పెట్టుబడుదారులను మోసం చేసినట్లు తెలిపారు. అందులో 26 ట్రాన్సాక్షన్స్ ద్వారా రూ.76,50,000 ఇన్వెస్ట్ చేశాడని పేర్కొన్నారు.

News October 29, 2025

మంచిర్యాల: ‘రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు’

image

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, సంబంధిత అధికారులతో కలిసి రోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని రోడ్లపై చెత్త, ఆటంకాలను వెంటనే తొలగించాలని, ట్రాఫిక్ పోలీస్ విభాగం రోడ్లపై అనాధికార వాహన నిలుపుదల నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.