News September 21, 2025

KMR: బతుకమ్మ పూల కోసం పొరుగు జిల్లాకు

image

బతుకమ్మ అలంకరించడానికి అవసరమైన గునుగు పూల కోసం ఎల్లారెడ్డి మండలం కల్యాణి గ్రామ ప్రజలు ఇతర జిల్లాలకు వెళ్తున్నారు. తమ ప్రాంతంలో పూలు దొరకకపోవడంతో ఆటోలో సంగారెడ్డి జిల్లాలోని కంగ్టికి వెళ్లి తిరిగి వస్తుండగా పిట్లంలో ఆగారు. ‘బతుకమ్మ అంటేనే పూల పండుగ అని, అందుకే ఎన్ని కష్టాలైన పడి, ఎన్ని కి.మీ. ఉన్నా సరే పూలను సేకరించి పండుగను జరుపుకొంటామని వారు Way2Newsతో చెప్పారు.

Similar News

News September 21, 2025

గజ్వేల్: డెంగ్యూతో బాలుడి మృతి

image

డెంగ్యూతో బాలుడు మృతి చెందిన ఘటన గజ్వేల్ మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కొడకండ్ల గ్రామానికి చెందిన ఎ.యశ్వంత్(11) డెంగ్యూతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత వారం రోజులుగా హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న యశ్వంత్ శనివారం ఆరోగ్యం విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడి మరణంతో కుటుంబీకులు తీవ్రంగా దుఃఖిస్తున్నారు.

News September 21, 2025

పర్వతగిరి: బతుకమ్మ తల్లి చరిత్ర పరిశోధకుడు.. వంగాల శాంతి కృష్ణుడు

image

పర్వతగిరి మండలం చౌటపల్లికి చెందిన వంగాల శాంతి కృష్ణుడు బతుకమ్మ తల్లి చరిత్ర గురించి పలు పరిశోధనలు చేశారు. బతుకమ్మ తల్లి జన్మస్థానం చౌటపల్లి గ్రామం అని తన పరిశోధనల ద్వారా ఆనవాళ్లను గుర్తించారు. దానికి శాస్త్రీయ ఆధారాలను వెతికే పనిలో ఉన్నారు. చరిత్ర పరిశోధనలో భాగంగా పలుచోట్ల నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరై బతుకమ్మ తల్లి విశేషాలను నేటి తరానికి వివరిస్తున్నారు.

News September 21, 2025

వరంగల్: నాటి పురాణ గాథలే నేటి బతుకమ్మ పాటలు

image

బతుకమ్మపాటల్లో రామాయణ, భారత పురాణ కథల ఆధారంగా అల్లిన జానపదాలున్నాయి. రేణుక ఎల్లమ్మ కథ ఆధారంగా అల్లుకున్న పాటలున్నాయి. బతుకమ్మ పాటల్లోని రాజ రంపాలుడి కథ మహాభారతం ఆధారంగా అల్లింది. ఎములాడ రాజన్న, యాదగిరి నరసన్న, శ్రీశైలం మల్లన్న కరుణా కటాక్షాలు చూపమని రామ రామ ఉయ్యాలో’ పాటల కోరుకుంటారు.
చల్లకుండ కాడ ఉయ్యాలో.. దాగి ఉన్నవు నాగ ఉయ్యాలో, చల్లల్లపురుగాని ఉయ్యాలో చంపేరు నిన్ను ఉయ్యాలో అంటూ ఆడి పాడుతారు.