News April 8, 2025
KMR: బాలుర అదృశ్యం సుఖాంతం.. SP అభినందన

ఇద్దరు బాలుర అదృశ్యం కేసును బీర్కూర్ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. వివరాల్లోకి వెళితే.. బీర్కూర్ జ్యోతిబాఫూలేలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు 7వ తేదీన రాత్రి 9 గం.ల నుంచి కనిపించకుండా పోయారు. 8న సాయంత్రం కుటుంబ సభ్యులు PSలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వారిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందించారు.
Similar News
News September 14, 2025
MBNR: జాతీయ లోక్ అదాలత్..2,597 కేసులు పరిష్కారం

జాతీయ మెగా లోక్ అదాలత్‌లో మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో 2,597 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ఎస్పీ డి.జానకి అన్నారు. ఆమె మాట్లాడుతూ.. 15 రోజులుగా పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది కేసుల్లో ఉన్న కక్షిదారులను స్వయంగా కలిసినందువల్ల రాజీ మార్గం అవగాహన కలిగించి, లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాలకూ ‘మీ ఇంటికే సత్వర న్యాయం’ జరిగిందని, మానిటరింగ్ చేసిన చేసినవారికి త్వరలో రివార్డు అందజేస్తామన్నారు.
News September 14, 2025
MBNR: ఓపెన్ డిగ్రీ, PG.. గడువు పెంపు

బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ యూజీ, పీజీలో అడ్మిషన్లకు ఈనెల 26 వరకు గడువు పొడిగించినట్లు ఉమ్మడి పాలమూరు జిల్లా ఓపెన్ యూనివర్సిటీ రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.సత్యనారాయణ గౌడ్ Way2Newsతో తెలిపారు. రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లి చదవలేని విద్యార్థులు, ఉద్యోగులకు ఓపెన్ యూనివర్సిటీ ఒక మంచి అవకాశం అని సూచించారు. పూర్తి వివరాలకు https://braou.ac.in వెబ్‌సైట్‌లో సందర్శించాలన్నారు. SHARE IT
News September 14, 2025
BJP భౌగోళికంగా విస్తరించాల్సి ఉంది: సత్యకుమార్

AP: డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. PVN మాధవ్ సారథ్య యాత్ర ముగింపు సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ‘ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా APని తీర్చిదిద్దుతున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నాం. కేంద్రం, రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకులు పరిపాలిస్తున్నారు. రాష్ట్రంలో భౌగోళికంగా BJP ఇంకా విస్తరించాల్సి ఉంది’ అని అన్నారు.