News April 16, 2025

KMR: భూగర్భ జలాల సంరక్షణపై కలెక్టర్ మీటింగ్

image

జిల్లాలో భూగర్భ జలాల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో నీటి కొరత నివారణకు ఫామ్ పాండ్స్, బోరవెల్లి రీచార్జ్, ఇంకుడు గుంతలు, సోక్‌పిట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్షపు నీటిని భూమిలోకి చొప్పించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. అదనపు కలెక్టర్ చందర్ నాయక్, భూగర్భ జలాధికారి సతీష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 14, 2025

ములుగు: PHASE-2లో పెరిగిన పోలింగ్ శాతం

image

జిల్లాలో మొదటి విడత పోలింగ్ జరిగిన 3 మండలాలతో పోల్చితే రెండవ విడత పోలింగ్ జరిగిన 3 మండలాల్లో ఓటింగ్ శాతం పెరిగింది. మొదటి విడత మండలాలైన గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో 73.57% పోలింగ్ నమోదు కాగా, రెండో విడత మండలాలైనా వెంకటాపూర్, ములుగు, మల్లంపల్లి మండలాల్లో 81.53% పోలింగ్ నమోదయింది. పెరిగిన పోలింగ్ శాతం అధికార పార్టీ మద్దతు దారులకు అనుకూలమని విశ్లేషకులు అభిప్రాయం.

News December 14, 2025

యూదులే లక్ష్యంగా టెర్రర్ దాడి?

image

ఆస్ట్రేలియా బీచ్‌లో <<18561798>>కాల్పులు<<>> యూదులే లక్ష్యంగా జరిపినట్లుగా తెలుస్తోంది. ఇవాళ్టి నుంచి 8 రోజులపాటు యూదులు ‘చనుకా(హనుక్కా)’ పండుగ జరుపుకుంటారు. రాత్రి పూట కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఇందుకోసం సిడ్నీలోని బాండీ బీచ్‌కు చేరుకున్న 2 వేల మందిపై ఇద్దరు గన్‌మెన్లు ఫైరింగ్ జరిపారు. ఇది యూదులపై ఉగ్రవాదులు జరిపిన నీచమైన దాడి అని ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఐజాక్ హెర్జోగ్ మండిపడ్డారు.

News December 14, 2025

సూర్యాపేట: ఐదు ఓట్ల తేడాతో తొలి విజయం

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన రెండో దశ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థి హాజీ నాయక్ ఆదివారం గెలుపొందారు. కోదాడ మండలం కూచిపూడి తండా గ్రామపంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఆయన ప్రత్యర్థిపై 5 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు చెప్పారు. తన గెలుపునకు కృషి చేసిన వార్డు ఓటర్లకు నూతన సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.