News April 24, 2025
KMR: భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులు: కలెక్టర్

భూ భారతి చట్టంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత చర్యలు చేపట్టింది. ఈ మేరకు KMR జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. గురువారం బీర్కూర్, నసురుల్లాబాద్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. భూమికి సంబంధించిన కొత్త చట్టంపై ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయడమే ఈ సదస్సుల ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.
Similar News
News April 24, 2025
కొత్తగూడెం: మత్స్యకారుల వలకు చిక్కిన మొసలి

మత్స్యకారుల వలకు మొసలి చిక్కిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని తుమ్మలచెరువులో జరిగింది. గురువారం కొందరు వ్యక్తులు చేపలు పట్టడానికి వెళ్లగా, వలలో మొసలి ప్రత్యక్షమైంది. భయాందోళనకు గురైన స్థానికులు విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలియజేయగా, ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మొసలిని గోదావరి నదిలో విడిచిపెట్టారు.
News April 24, 2025
PLAYOFFS: ఏ జట్టుకు ఎంత ఛాన్స్ అంటే?

ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌కు ప్లేఆఫ్స్ వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ జట్టుకు 91% ప్లేఆఫ్స్‌కు వెళ్లే ఛాన్స్ ఉంది. అతి తక్కువగా CSKకు 0.8 శాతం మాత్రమే అవకాశం ఉంది. ఆ తర్వాత ఢిల్లీ(85%), బెంగళూరు(62%), పంజాబ్(58%), ముంబై(51%), లక్నో(34%), కోల్‌కతా(15%), రాజస్థాన్(2%), హైదరాబాద్(1%) ఉన్నాయి.
News April 24, 2025
‘రెట్రో’ కథ ఆ హీరో కోసం అనుకున్నా: కార్తీక్ సుబ్బరాజు

‘రెట్రో’ సినిమా కథను దళపతి విజయ్ కోసం రాశారన్న ప్రచారంపై దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు స్పందించారు. రజినీకాంత్ కోసం ఈ స్టోరీ రాసుకున్నట్లు వెల్లడించారు. సూపర్ స్టార్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని కథను సిద్ధం చేశానని తెలిపారు. సూర్య రావడంతో పలు మార్పులు చేసినట్లు చెప్పారు. సినిమాలో రొమాంటిక్ డ్రామాను జోడించినట్లు పేర్కొన్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా మే 1న విడుదల కానుంది.