News March 23, 2024
KMR: మత్తు పదార్థాలు అమ్మిన ముఠా అరెస్ట్

మత్తుపదార్థాలు అమ్మిన ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎల్లారెడ్డి DSP శ్రీనివాసులు వెల్లడించారు. గురువారం పద్మాజీవాడి X రోడ్‌లో నిషేధిత అల్ఫాజోలం అమ్ముతున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. నలుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.5 లక్షల విలువ చేసే అల్ఫాజోలం, 2 కార్లు, 2 బైక్‌లు, 5 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. కాగా రాజస్థాన్‌కు చెందిన మరో 2 పరారీలో ఉన్నారు.
Similar News
News April 15, 2025
NZB : డంపింగ్ యార్డ్‌ను పరిశీలించిన కమిషనర్

నాగారంలోని డంపింగ్ యార్డ్ అగ్ని ప్రమాదానికి గురైన నేపథ్యంలో సోమవారం రాత్రి యార్డును నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. సెక్యూరిటీ తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పొగ కారణంగా శ్వాస తీసుకోవడం ఇబ్బంది కలుగుతోందని అక్కడి కాలనీవాసులు ఆదివారం మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
News April 15, 2025
KMR: కుమారుని పెళ్లి.. తండ్రి మృతి

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం శివయ్య పల్లి గ్రామంలో సోమవారం కుమారుడి వివాహ వేడుకల్లో తండ్రి మృతి చెందడం కలకలం రేపింది. గజ్జెల వెంకటి(57) అతని కుమారుని పెళ్లి వేడుకలో ఫంక్షన్ హాల్‌లో పని చేస్తుండగా 11KV విద్యుత్ తీగలు తగలడంతో కరెంట్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పుష్పరాజు తెలిపారు.
News April 15, 2025
NZB: నేడు ఉమ్మడి NZB జిల్లాకు ఎమ్మెల్సీ కవిత

ఎమ్మెల్సీ కవిత ఉమ్మడి NZB జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో పాల్గొంటారు. అనంతరం NZB జిల్లా బోధన్‌లో మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ వెంకటేశ్వర్ దేశాయి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు డిచ్‌పల్లిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.