News February 4, 2025
KMR: ‘మత్స్యకారులందరరూ వివరాలను నమోదు చేసుకోవాలి’

కామారెడ్డి జిల్లాలోని ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న మత్స్యకారులందరూ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ్ యోజన కింద CSC సెంటర్ లలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీపతి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాతో పాటు వ్యక్తిగత సమాచారంతో తమ కామన్ సర్వీస్ కేంద్రాలను సంప్రదించాలన్నారు.
Similar News
News September 18, 2025
పాలమూరు RTCలో ఉద్యోగాలు

సుదీర్ఘ విరామం తర్వాత <<17746081>>ఆర్టీసీలో ఉద్యోగాల<<>> భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి MBNR రీజియన్‌లో ఖాళీలు ఇలా ఉన్నాయి. MBNRలో డ్రైవర్ 20, శ్రామిక్ పోస్టులు 5, NGKLలో డ్రైవర్ 20, శ్రామిక్ 2, GWLలో డ్రైవర్ 13, శ్రామిక్ 4, WNPలో డ్రైవర్ 13, శ్రామిక్ 4, NRPTలో డ్రైవర్ 13, శ్రామిక్ 3 పోస్టులు ఉన్నాయి. అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
-SHARE IT
News September 18, 2025
తల్లిపాలు ఎలా మాన్పించాలంటే..!

శిశువు ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో ముఖ్యం. కానీ వయసు పెరుగుతున్నా కొందరు పిల్లలు పాలు మానరు. దీనికోసం ఒకేసారి మాన్పించకుండా పాలు ఇచ్చే వ్యవధి తగ్గింస్తుండాలి. లేదంటే వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. పిల్లలకు కడుపునిండా ఆహారాన్ని ఇవ్వాలి. ఏడాది తర్వాత నుంచి ఘన పదార్థాలు అలవాటు చెయ్యాలి. ఆరోగ్యకరమైన చిరుతిళ్లు ఇవ్వడం, పాలు అడిగినప్పుడు వారిని డైవర్ట్ చేయడం వల్ల నెమ్మదిగా మానేస్తారు.
News September 18, 2025
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట RTCలో ఉద్యోగాలు

సుదీర్ఘ విరామం తర్వాత<<17746081>> ఆర్టీసీలో ఉద్యోగాల<<>> భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి మెదక్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో సంగారెడ్డి జిల్లాలో 52, మెదక్, సిద్దిపేటలో ఒకటి చొప్పున డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 64, మెదక్ జిల్లాలో 4, సిద్దిపేటలో 4 శ్రామిక్ పోస్టులు ఉన్నాయి. అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
-SHARE IT