News March 15, 2025

KMR: మద్యం మత్తులో కరెంట్ పోల్ ఎక్కి హల్‌చల్

image

నాగిరెడ్డిపేట మండలం తాండూర్ గ్రామంలో చాకలి నరసింహులు అనే యువకుడు మద్యం మత్తులో కరెంటు స్తంభం ఎక్కి వీరంగం సృష్టించాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూర్ గ్రామానికి చెందిన చాకలి నరసింహులు తన ఇంట్లోకి కరెంటు సరఫరా కావడం లేదని విద్యుత్ స్తంభం ఎక్కి ప్రయత్నం చేశారు. ఇంటి పక్క వారు వెంటనే సబ్ స్టేషన్‌కు ఫోన్ చేయడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ప్రమాదం తప్పింది.

Similar News

News November 8, 2025

గూగుల్ మ్యాప్స్‌లో ఆర్టీసీ టికెట్ బుకింగ్

image

టికెట్ బుకింగ్ కోసం APSRTC మరో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఎక్కడి నుంచి ఎక్కడికెళ్లాలో గూగుల్ మ్యాప్స్‌లో సెర్చ్ చేస్తే ఆ రూట్‌లో తిరిగే ఆర్టీసీ రిజర్వేషన్ సదుపాయం ఉన్న బస్సులు, జర్నీ టైమ్‌ వివరాలు కనిపిస్తాయి. వాటి మీద క్లిక్ చేస్తే RTC వెబ్‌సైట్‌లోకి తీసుకెళ్తుంది. ఈ మేరకు గూగుల్ ప్రతినిధులతో చర్చలు పూర్తయ్యాయి. VJA-HYD మార్గంలో అమలుచేయగా విజయవంతమైంది. త్వరలో అన్ని రూట్లలో మొదలుకానుంది.

News November 8, 2025

కొత్తకోట వద్ద కారు, లారీ ఢీ.. సెక్రటరీ మృతి

image

గద్వాలలో వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా, కొత్తకోట వద్ద కారు ఆపగా.. వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ కారుపై బోల్తా పడింది. కారులో ఉన్న వేముల గ్రామ పంచాయతీ సెక్రటరీ సతీష్ రెడ్డి తీవ్ర గాయాలై, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ఆ సమయంలో టాయిలెట్ కోసం కిందకు దిగిన ముగ్గురు సెక్రెటరీలు ప్రాణాలతో బయటపడ్డారని స్థానికులు తెలిపారు.

News November 8, 2025

నాగిరెడ్డిపేట: భార్య గొంతు కోసిన భర్త

image

భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా భర్త తన భార్య గొంతును కోసినట్లు నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. నాగిరెడ్డిపేట మండలం చీనురు గ్రామానికి చెందిన నారాయణ ఆయన భార్య రామవ్వ మధ్య గొడవ జరిగిందన్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నారాయణ తన భార్య గొంతు కోసినట్లు చెప్పారు. గాయపడిన రామవ్వను చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.