News April 15, 2025
KMR: మద్యం మత్తులో కిందపడి వ్యక్తి మృతి

కామారెడ్డి గోసంగి కాలనీకి చెందిన నాగరాజు(35) మద్యం మత్తులో కిందపడి మరణించినట్లు ఏఎస్ఐ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం..నాగరాజు అతని బామ్మర్ది రాజుతో కలిసి భవానిపేటకు వెళ్లారు. అక్కడ ఇద్దరు కలిసి పొలానికి వెళ్లి మద్యం తాగారు. తిరిగి వెళ్తుండగా నాగరాజు కింద పడ్డాడు. గాయాలు కావడంతో HYDలో హాస్పిటల్లో చికత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 27, 2026
విడాకులు కోరిన హీరో విజయ్ భార్య

తమిళ స్టార్ హీరో, TVK అధినేత విజయ్‌కు ఆయన భార్య సంగీత షాక్ ఇచ్చారు. భర్త నుంచి విడాకులు కోరుతూ చెంగల్‌పట్టు జిల్లా కోర్టులో ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని స్వీకరించిన కోర్టు ఏప్రిల్ 20న విచారణకు రావాలని విజయ్‌కు నోటీసులిచ్చింది. 2025 నుంచి వీరు విడాకులు తీసుకుంటారని రూమర్స్ వచ్చాయి. 1999లో వీరి వివాహం జరగ్గా ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. పెళ్లైన 26ఏళ్ల తర్వాత విడాకులు కోరడం చర్చనీయాంశమవుతోంది.
News February 27, 2026
పెద్దపల్లి: రాష్ట్రస్థాయిలో మెరిసిన క్రీడాకారులకు సన్మానం

సీఎం కప్ 2026 రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం సమీకృత కలెక్టరేట్‌లో సన్మానించారు. జిల్లా నుంచి పాల్గొన్న 22 మంది విద్యార్థులు 4 బంగారు, 8 వెండి, 10 కంచు పతకాలు సాధించినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాకు కీర్తి తీసుకువచ్చిన క్రీడాకారులను అభినందిస్తూ భవిష్యత్తులో మరింత రాణించాలని ఆకాంక్షించారు.
News February 27, 2026
జగిత్యాల: పీఎం పోషణ్ తనిఖీ.. కేజీబీవీని సందర్శించిన కలెక్టర్

జగిత్యాల పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆకస్మికంగా సందర్శించారు. పీఎం పోషణ్ తనిఖీలో భాగంగా మధ్యాహ్న భోజన నాణ్యత, వంటగది పరిశుభ్రత, నిల్వ విధానాలను పరిశీలించారు. పదో తరగతి ఫలితాల మెరుగుదలకు ప్రత్యేక తరగతులు, మోడల్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


