News December 15, 2025

KMR: మరో మూడు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు

image

కామారెడ్డి జిల్లాలో గత మూడు రోజులుగా చలి తీవ్రత కనిష్ఠానికి నమోదయ్యి, చలి తీవ్రత స్థిరంగా ఉంది. అయితే మరో మూడు రోజుల పాటు జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 9 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యి, చలి తీవ్రత మరింత పెరుగుతుందని అంచనా వేసింది. చలి ప్రభావం పెరగనుండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News December 18, 2025

అత్యధికం ఎల్లారెడ్డి.. అత్యల్పం రామారెడ్డి

image

కామారెడ్డి జిల్లాలో మూడు విడతల్లో ఈ నెల 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 5,97,512 ఓటర్లకు గాను 4,97,861 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా రెండో విడతలో 86.08% పోలింగ్ జరగగా, అత్యల్పంగా మొదటి విడతలో 79.40% పోలైంది. అత్యధికంగా ఎల్లారెడ్డి మండలంలో ఓట్లు పోలవ్వగా, అత్యల్పంగా రామారెడ్డిలో పోలయ్యాయి.

News December 18, 2025

టైగర్ జోన్‌లో ఆవాసాల కొరత.. జనావాసాల్లోకి పులులు

image

టైగర్ జోన్ పరిధిని దాటి పులులు పెద్దపల్లి జిల్లాలో గ్రామాల శివార్లలోకి రావడం స్థానిక ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. చెట్ల నరికివేత, గనులు, రోడ్ల నిర్మాణంతో పులుల సహజ ఆవాసాలు తగ్గిపోవడం, అడవుల్లో ఆహారం, నీటి కొరత పెరగడం జనావాసాల్లో పులుల సంచారానికి ప్రధాన కారణాలుగా అధికారులు భావిస్తున్నారు. అక్రమ వేట, స్మగ్లింగ్ ముప్పూ పెరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయి. పులుల సంచారం పెరగడంతో అటవీ శాఖ అప్రమత్తమైంది.

News December 18, 2025

చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు

image

AP: సీఎం చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు వచ్చినట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ‘మా కుటుంబానికి, ఏపీకి గర్వకారణమైన క్షణం. సీఎం చంద్రబాబును బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో ఎకనమిక్ టైమ్స్ సంస్థ సత్కరించింది. భారతదేశ సంస్కరణల ప్రయాణాన్ని ఇంత స్పష్టత, ధైర్యం, స్థిరత్వంతో తీర్చిదిద్దిన నాయకులు కొందరే. ఈ అవార్డు ఆయన సంస్కరణలు, వేగం, పాలనపై నమ్మకానికి దక్కిన గౌరవం’ అని ట్వీట్ చేశారు.