News February 26, 2025
KMR: మహా శివ రాత్రి.. శివాలయాలపై ప్రత్యేక కథనం..

శివరాత్రి నేపథ్యంలో KMR జిల్లాలోని ఆయా శివాలయాల పై ప్రత్యేక కథనం..దాదాపు 400 ఏళ్ల చరిత్ర ఉన్న ఆది బసవేశ్వర స్వయంభు ఆలయం బొర్లంలో ఉంది. గుడిలోని ఆది బసవేశ్వరుడి నంది విగ్రహం ఏటేటా పెరుగుతూ ఉండడం విశేషం. 1500 ఏళ్ల క్రితం నిర్మించిన సోమలింగేశ్వర ఆలయం దుర్కిలో ఉంది. భక్తుల కోరికలు తీర్చే లింగేశ్వరుడిగా ఈ ఆలయం పేరు గాంచింది. మరి మీ గ్రామాల్లో ఉన్న ఆలయాల ప్రత్యేకత గురించి కామెంట్‌లో తెలుపండి.
Similar News
News November 6, 2025
GNT: పత్తి రైతుల సందేహాల కోసం హెల్ప్‌లైన్

జిల్లాలో గురువారం నుంచి CCI పత్తి కొనుగోళ్లను ప్రారంభించింది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 30 కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేశారు. పత్తిలో తేమ 8% మించకపోతే, రైతులకు పూర్తి కనీస మద్దతు ధర (MSP) లభిస్తుందని అధికారులు తెలిపారు. ఆరబెట్టిన పత్తిని మాత్రమే కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం రైతులు 7659954529 హెల్ప్‌లైన్ నంబర్ సంప్రదించాలని సూచించారు.
News November 6, 2025
జిల్లా వ్యాప్తంగా వందేమాతరం 150 ఏళ్ల ఉత్సవాలు: కలెక్టర్

వందేమాతరం జాతీయ గీతం ఆవిష్కరణకు 150 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు ఏడాది పాటు వందేమాతరం ఉత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. ఈనెల 7 నుంచి వచ్చే ఏడాది 2026 నవంబర్ 7 వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. వందేమాతరం గీతం సందేశంలో ప్రాధాన్యతను, విద్యాసంస్థలు, సాంస్కృతిక సంస్థలు, స్థానిక సంస్థలను చేర్చాలని కలెక్టర్ తెలిపారు.
News November 6, 2025
జుట్టుకు రంగు వేస్తున్నారా?.. జాగ్రత్త!

పదేపదే హెయిర్ డై లేదా కలరింగ్ చేసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుందని ముంబై హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ అభిషేక్ పిలానీ హెచ్చరించారు. ‘తరచుగా రంగులు వేయడం వల్ల జుట్టులోని కెరాటిన్ దెబ్బతిని పెళుసుగా మారడం, చివర్లు చిట్లడం జరుగుతుంది. అమోనియా, పెరాక్సైడ్ వంటి తీవ్రమైన రసాయనాలు జుట్టుకు శాశ్వత నష్టం కలిగిస్తాయి. జుట్టు రాలడం, పలుచబడటం వంటి సమస్యలు తీవ్రమవుతాయి’ అని పేర్కొన్నారు.


