News March 29, 2025

KMR: మహిళా సాధికారత దిశగా వరి కొనుగోళ్లు: కలెక్టర్

image

మహిళా సాధికారత దిశగా కామారెడ్డి జిల్లా అడుగులు వేస్తుందని.. అందులో భాగంగానే మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్ల పై కలెక్టరేట్‌లో శనివారం గ్రామ అధ్యక్షులకు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 183 సెంటర్‌లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News December 22, 2025

పల్నాడు: అధిష్ఠానం నిర్ణయం.. అసంతృప్తి జ్వాలలు.?

image

పల్నాడు జిల్లా టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. అధినాయకత్వం జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల పదవుల నియామకాలలో తీసుకున్న నిర్ణయంపై అధిక శాతం మంది పూర్తి వ్యతిరేకతతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పెదకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థానం వదులుకొని జిల్లాలో పార్టీని గెలిపించిన కొమ్మాలపాటి శ్రీధర్ నాయకత్వాన్ని ఎందుకు అధిష్ఠానం పరిగణలోకి తీసుకోలేదనే చర్చ నడుస్తోంది.

News December 22, 2025

వాట్సాప్‌లోనే ఈ-చలాన్లు.. ఇలా చెక్ చేసుకోండి!

image

AP: రాష్ట్ర ప్రభుత్వ సేవలను వాట్సాప్‌లో అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వాట్సాప్ గవర్నెన్స్‌‌లో పోలీసు సర్వీసులూ చేరాయి. 9552300009 నంబర్‌కు Hi అని మెసేజ్ చేసి సర్వీసు కేటగిరీలోకి వెళ్తే ‘పోలీస్ శాఖ సేవలు’ ఆప్షన్ కనిపిస్తుంది. అందులో FIR, FIR స్టేటస్, ఈ-చలాన్ వివరాలు తెలుసుకోవచ్చు. వెహికల్‌ నంబర్ ఎంటర్ చేస్తే బండిపై నమోదైన ఈ-చలాన్ వివరాలు వస్తాయి. అక్కడే UPI ద్వారా చెల్లించవచ్చు.

News December 22, 2025

ఈ నెల 26 నుంచి వారికి వోచర్లు: ఇండిగో

image

విమాన సర్వీసుల <<18492900>>రద్దుతో<<>> ప్రభావితమైన ప్రయాణికులకు గరిష్ఠంగా రూ.10వేలు విలువ చేసే వోచర్స్‌ను DEC 26 నుంచి ఇండిగో ఇవ్వనుంది. ఏవియేషన్ సెక్రటరీ అధ్యక్షతన జరిగిన సమీక్షలో ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రభావితమైన ప్రయాణికులకు ఇవ్వాలని ఇండిగోకు సూచించారు. వెబ్‌సైట్ నుంచి బుక్ చేసుకున్న వారికి వారంలోపే ఇవ్వనుంది. అటు ట్రావెల్ ఏజెన్సీల నుంచి వివరాలు సేకరిస్తోంది. ఈ నెల 3-5 మధ్య ప్రయాణాలకే వర్తిస్తాయని సమాచారం.