News March 8, 2026
KMR: మహిళే ఓదార్పు

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నప్పటికీ.. పురుషుల్లోని క్రూరత్వం మానవత్వాన్ని చంపేస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిత్యం మహిళలపై దాడులు జరుగుతున్నాయి. ఓ చోట అత్యాచారం, మరోచోట పెత్తనంతో హత్యాచారం, ఇంకోచోట పిల్లలను కడతేర్చే ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మహిళా దినోత్సవం రోజు మాత్రమే మహిళలకు గౌరవం దక్కుతుందే తప్పా మిగతా రోజులు మిథ్యగానే మారుతున్నాయి.
Similar News
News March 8, 2026
ట్రంప్‌ను వదిలేది లేదు.. ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్

అయతుల్లా ఖమేనీ మృతికి ట్రంప్ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని హెచ్చరించారు. తమ నాయకుడు చిందించిన రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటామని Xలో స్పష్టం చేశారు. ‘ఇరాన్‌కు వ్యతిరేకంగా తమ భూభాగాలను US ఉపయోగించుకోకుండా మిడిల్ ఈస్ట్ దేశాలు నిరోధించాలి. ఆ ప్రాంతాల నుంచి దాడి జరిగితే మేం ప్రతిస్పందిస్తాం’ అని తేల్చిచెప్పారు. IRGC కొందరు అమెరికన్ సైనికులను బంధించిందని పేర్కొన్నారు.
News March 8, 2026
కోచ్‌గా గంభీర్.. విమర్శకుల నోళ్లు మూయిస్తారా?

టీమ్ ఇండియా కోచ్‌గా ప్రశంసల కంటే <<18976802>>విమర్శలనే<<>> గంభీర్ ఎక్కువ ఎదుర్కొన్నారు. తన వ్యూహాలు, ఎంపికలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఒక్క మ్యాచ్ ఓడినా, అతడు సపోర్ట్ చేసిన ప్లేయర్ రాణించకున్నా విమర్శకుల దండయాత్ర జరిగేది. కానీ వాటిని దాటుకుని, INDను T20 WC ఫైనల్‌కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. కెప్టెన్ సూర్యకు అవసరమైన సలహాలిస్తూ నడిపించారు. మరి ఇంకో గెలుపుతో విమర్శకుల నోళ్లు మూయిస్తారా? కామెంట్ చేయండి.
News March 8, 2026
హనుమకొండ: ఈనెల 10న నీ రుణం తీరేది ఎట్ల పుస్తకావిష్కరణ

హనుమకొండకు చెందిన జబర్దస్త్ ఫేమ్ రచ్చ రవి తన స్వీయ అనుభవాలతో ‘నీ రుణం తీరేది ఎట్ల’అనే పుస్తకాన్ని రచించారు. ఈనెల 10వ తేదీన హైదరాబాద్‌లో పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు రచ్చ రవి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని నటుడు, ఆధ్యాత్మికవేత్త తనికెళ్ల భరణిని ఆహ్వానించారు. పుస్తక నమూనా ప్రతిని తనికెళ్ల భరణికి బహూకరించారు.


