News March 28, 2025
KMR: మాథ్స్ ప్రశ్నలు లీక్‌లో అరెస్టయ్యింది వీరే (UPDATE)

జుక్కల్‌లో గణిత పరీక్ష ప్రశ్నలు లీకైన కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. SP రాజేష్ చంద్ర వివరాలను వెల్లడించారు. ఓ తండ్రి తన కుమారుడి కోసం ఎగ్జామ్ సెంటర్‌లో వాటర్ సప్లయ్ చేసే వ్యక్తితో ప్రశ్నలు బయటకు తెప్పించాడు. కొంతమంది అతడి నుంచి ప్రశ్నలు తీసుకొని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. జాదవ్ సంజయ్, ముబీన్, మనోజ్, వరప్రసాద్, హన్మండ్లు, గంగాధర్‌లను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశామన్నారు.
Similar News
News September 19, 2025
జహీరాబాద్: ప్రపంచ సుడోకు ఛాంపియన్‌షిప్‌కు తండ్రీకొడుకు

ప్రపంచ సుడోకు ఛాంపియన్‌షిప్ పోటీలకు జహీరాబాద్‌కు చెందిన తండ్రీకొడుకులు ఎంపికయ్యారు. మలచెల్మ గ్రామానికి చెందిన ఎం. జైపాల్ రెడ్డి, ఆయన కుమారుడు కార్తీక్ రెడ్డి ఈనెల 21 నుంచి హంగేరిలోని ఎగర్‌లో జరిగే పోటీల్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. జైపాల్ రెడ్డి 2007 నుంచి జాతీయ, అంతర్జాతీయ సుడోకు పోటీలలో పాల్గొంటూ తన కుమారుడికి కూడా ఈ పోటీలలో పాల్గొనడానికి ప్రోత్సాహం అందిస్తున్నారు.
News September 19, 2025
‘చలో మెడికల్ కాలేజీ’.. వైసీపీ ఆందోళనలు

AP: మెడికల్ కాలేజీల PPP విధానంపై వైసీపీ ‘చలో మెడికల్ కాలేజీ’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు కొందరు ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేశారు. మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గం అని నేతలు విమర్శించారు. ప్రైవేటీకరణను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటు #SaveMedicalCollegesInAP అంటూ వైసీపీ ట్వీట్లు చేస్తోంది.
News September 19, 2025
డయేరియా బాధితుల పరిస్థితి నిలకడగా ఉంది: కలెక్టర్

డయేరియాపై ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. బుధవారం 33 మంది డయేరియా లక్షణాలతో జీజీహెచ్‌లో చేరారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడారు. రోగులు కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల వ్యాధి ప్రబలిందని వైద్యుల ప్రాథమిక నివేదికలో తేలిందన్నారు. తాగునీటి శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపుతున్నామన్నారు.