News March 1, 2025
KMR మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి: SP

మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని KMR జిల్లా SP సింధు శర్మ పిలుపునిచ్చారు. ఇద్దరు మావోయిస్టు సభ్యులు ఇవాళ SP ముందు లొంగిపోయిన విషయం తెలిసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జన జీవన స్రవంతిలో కలిసి ఉండాలనుకునేవారికి ప్రభుత్వం తరపున వచ్చే లభాలన్ని అందేలా చూస్తామన్నారు. అజ్ఞాతంలో ఉండి సాధించేదేమీ లేదని, లొంగితే పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించేందుకు కృషి చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.
Similar News
News September 18, 2025
అరాచకమే.. సందీప్ వంగాతో మహేశ్ మూవీ?

రాజమౌళితో సినిమా తర్వాత మహేశ్ బాబు చేసే మూవీ విషయమై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీని కోసం మైత్రీ మూవీ మేకర్స్, ఏషియన్ సునీల్ పోటీలో ఉన్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో మూవీ చేయాలని మహేశ్‌ను సునీల్ కోరినట్లు తెలిపాయి. కాల్షీట్ల ఆధారంగా దీనిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందన్నాయి. దీంతో సందీప్, మహేశ్ కాంబినేషన్ కుదిరితే అరాచకమేనని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.
News September 18, 2025
పూసపాటిరేగ: వేటకు వెళ్లి మృతి

పూసపాటిరేగ మండలం పెద్దూరుకు చెందిన ఓ మత్స్యకారుడు వేటకు వెళ్లి మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మత్స్యకారుడైన బి.రాము బుధవారం వేటకు వెళ్లగా.. చేపల కోసం వల వేసే క్రమంలో జారి పడిపోయాడు. అక్కడున్నవారు కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఈ ఘటనపై మెరైన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News September 18, 2025
ప్రకాశం ఎస్పీ గారూ.. ప్లీజ్ ఈవ్ టీజింగ్‌పై లుక్కేయండి!

ప్రకాశం జిల్లా నూతన SP హర్షవర్ధన్ రాజు ఇటీవల బాధ్యతలు చేపట్టారు. తిరుపతిలో SPగా ఉన్నప్పుడు ఈవ్ టీజింగ్‌పై ఉక్కుపాదం మోపారు. ఇప్పుడు ప్రకాశంలో కూడా అదే తీరు చూపాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. స్కూల్స్, కళాశాలలు మొదలు, ముగిసే సమయాల్లో పోకిరీల ఆగడాలు పెరిగాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. SP చొరవ తీసుకోవాలని వారు కోరారు.