News January 9, 2026
KMR: ముగిసిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్

కామారెడ్డిలో 3 రోజులుగా సాగిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ శుక్రవారం ముగిసింది. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి సుమారు 1,700 మంది విద్యార్థులు, పాల్గొని 870 అద్భుత ప్రదర్శనలను ప్రదర్శించారు. ఏడు విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సౌత్ ఇండియా, జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. జిల్లా సైన్స్ అధికారి సిద్ధరామ్ రెడ్డి కార్యక్రమ నివేదికను సమర్పించి, సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News February 19, 2026
SRD: ఉపవాసాలు.. ఆధ్యాత్మిక సందేశాలు

ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం గురువారం నుంచి ఆరంభం కానుంది. క్రమశిక్షణ దాతృత్వం. ధార్మిక చింతనలే కలయిక రంజాన్ మాసం 30 రోజుల పాటు కటిన ఉపవాస దీక్షలతో ఆరంభించి దీక్ష ముగిస్తారు నెలపొడుపు దర్శనం.చంద్రుని దర్శించిన తర్వాత రోజు ఉదయం నుంచి పండుగను జరుపుకుంటారు. వేడుక కోసం సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మసీదులను అందంగా ముస్తాబు చేశారు.
News February 19, 2026
మెదక్: ‘ఉత్తమ అధికారులుగా పేరు తెచ్చుకోవాలి’

మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావును గ్రూప్-1 శిక్షణ అధికారులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ వారికి విధి నిర్వహణపై పలు సూచనలు చేశారు. అధికారులు క్రమశిక్షణ, నిజాయితీతో పాటు మానవత్వంతో ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ ఉత్తమ అధికారులుగా పేరు తెచ్చుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు.