News February 17, 2026

KMR: మున్సి‘పల్స్’ అతివలదే

image

కామారెడ్డి జిల్లాలో మున్సిపాలిటీల్లో ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్‌లుగా పీఠాలెక్కిన వారంతా అతివలే. వైస్ ఛైర్మన్‌లుగా పురుషులకు అవకాశం ఉన్నప్పటికీ అధికారపక్షం మహిళా వికాసం వైపే మొగ్గుచూపింది. దీంతో జిల్లాలో ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఛైర్మన్ మినహాయించి అన్ని చోట్ల మహిళలే పుర పీఠాలేక్కారు. జిల్లాలో మహిళాభుద్యాయం మరింత బలపడనుంది. రాజకీయాల్లో తాము సైతం రాణిస్తామని, అభివృద్ధికి పాటుపడతామంటున్నారు.

Similar News

News February 17, 2026

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

image

నాదెండ్ల – గణపవరం మధ్య నూతన హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో, వాహనదారుడు ఎగిరి కిందపడి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు హెల్మెట్ ధరించకపోవడమే మరణానికి ప్రధాన కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెల్మెట్ ఉండి ఉంటే ప్రాణాలు దక్కేవన్నారు.

News February 17, 2026

BREAKING.. జనగామ ఛైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం

image

జనగామ మున్సిపల్ ఛైర్మన్‌ ఎన్నిక ఉత్కంఠగా సాగింది. కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 13, సీపీఎం 1, స్వతంత్ర అభ్యర్థులు నలుగురు గెలుపొందడంతో ఇద్దరు స్వతంత్రులు కాంగ్రెస్‌కు, ఇద్దరు బీఆర్ఎస్‌కు మద్దతు పలకగా ఎక్స్ అఫీషియో మెంబర్లతో హంగ్ ఏర్పడింది. ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు రాగా.. లాటరీ పద్ధతిలో చీటీ తీయగా కడకంచి బాలమణి కాంగ్రెస్ అభ్యర్థి ఛైర్మన్ పీఠం కైవసం చేసుకుంది.

News February 17, 2026

HYD: 99 ఏళ్ల లీజుకు మూసీ తీరం!

image

మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులో ఇప్పటివరకు బయటకు రాని విషయం ఏమిటంటే.. డ్రాఫ్ట్ ప్రపోజల్ ప్రకారం నదీ తీరాన స్వాధీనం చేసుకున్న భూములను “స్పెషల్ ఎకనామిక్ టూరిజం జోన్లు” (SETZ) గా మార్చబోతున్నారు. అంతర్గత నివేదికల ప్రకారం.. సుమారు 58,000 కోట్ల ప్రాజెక్టు వ్యయాన్ని భరించడానికి ప్రభుత్వం ‘మానిటైజేషన్’ పద్ధతిని ఎంచుకుంది. ప్రభుత్వం అభివృద్ధి చేసిన గట్టును 99 ఏళ్ల లీజుకు అంతర్జాతీయ సంస్థలకు కట్టబెడతారు.