News February 4, 2025
KMR: మెరిట్ లిస్ట్ విడుదల: DMHO
వ్యాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్ రిక్రూట్మెంట్‌కి సంబంధించి ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖధికారి కార్యాలయంలో డిస్ప్లే చేయడం జరిగిందని DMHO చంద్రశేఖర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో పాటు Kamareddy.telangana.gov.in వెబ్సైట్లో తమ వివరాలు చూసుకోవచ్చని పేర్కొన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు.
Similar News
News February 4, 2025
టెన్త్ ప్రీఫైనల్.. ఏపీ, టీజీ షెడ్యూల్ ఇలా
APలో ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు టెన్త్ క్లాస్ ప్రీఫైనల్ <<14926648>>పరీక్షలు<<>> నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. లాంగ్వేజెస్, మ్యాథ్స్ ఉ.9.30-మ.12.45 వరకు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పేపర్లకు ఉ.9.30-11.30 వరకు జరుగుతాయి. TGలో మార్చి 6 నుంచి 15 వరకు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. మ.12.15-3.15 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. పిల్లలకు మ.12.15లోపే భోజనం అందించాలని ఆదేశించారు.
News February 4, 2025
డిండి: కోడలు దాడిలో మామ మృతి
కోడలు దాడిలో మామ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని గోనబోయినపల్లిలో జరిగింది. ఎస్సై రాజు తెలిపిన వివరాలు.. ఇంటి ముందు కూర్చున్న బద్దె రాములు (65)ను కుటుంబ గొడవల కారణంగా పెద్ద కోడలు పెద్దులమ్మ కర్రతో కొట్టి రోడ్డుపై నెట్టి వేయిగా రాములు తల వెనుక భాగంతో తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య జంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
News February 4, 2025
వచ్చే నెలాఖరు వరకు ఖరీఫ్ ధాన్యం సేకరణ
AP: ఖరీఫ్ ధాన్యం సేకరణ గడువును ప్రభుత్వం మార్చి నెలాఖరు వరకు పొడిగించింది. ఇప్పటి వరకు 31.52 లక్షల టన్నులను కొనుగోలు చేసినట్లు తెలిపింది. రైతుల ఖాతాల్లో రూ.7,222 కోట్లు జమ చేశామని వెల్లడించింది. మార్చి తర్వాత కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయడంపై పరిశీలన చేస్తామంది. రైతుల పేరుతో వ్యాపారులు ధాన్యాన్ని విక్రయించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.