News March 20, 2025
KMR: రాష్ట్రస్థాయి పోటీలకు 18 మంది

కామారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాగాంధీ స్టేడియంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. అండర్ 14, 16, 18, 20 విభాగాల్లో వివిధ అంశాల్లో మెన్, ఉమెన్ సెలెక్షన్స్ నిర్వహించగా.. 18 మంది ఉత్తమ ప్రతిభ కనబరిచారు. వీరందరూ.. ఈ నెల 23న గార్డియం స్టేడియం కొల్లూరు, HYDలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్ కార్యదర్శి అనిల్ తెలిపారు.
Similar News
News March 20, 2025
అలా చేయడం రేప్ కాదు: అలహాబాద్ హైకోర్టు

వక్షోజాలను తాకడం, పైజామాను తీసివేయాలని ప్రయత్నించడం రేప్ కిందకు రాదని అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. 11 ఏళ్ల చిన్నారితో ఇద్దరు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించిన కేసులో ఇలా పేర్కొంది. అయితే ఈ కేసులో బాధితురాలిని దుస్తులు లేకుండా చేయలేదని సాక్షులు పేర్కొన్నట్లు తెలిపింది. అంతేకాకుండా లైంగిక దాడికి యత్నించారనే ఆరోపణలు కూడా లేవంది. కింది కోర్టు రేప్ కేసుగా పేర్కొనగా HC దానిని సవరించింది.
News March 20, 2025
లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. నెల తర్వాత 23K చేరిన నిఫ్టీ

అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నెల తర్వాత నిఫ్టీ 23వేల మార్కును అందుకుంది. అటు సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడి 75,889 వద్ద చలిస్తోంది. ఐటీ, బ్యాంకింగ్ రంగాలు లాభాల బాట పట్టాయి.
News March 20, 2025
రాష్ట్రంలో పెరిగిన బాలికల జననాలు

AP: రాష్ట్రంలో బాలికల జననాలు పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. 2023-24లో ప్రతి వెయ్యి మంది బాలురకు 944 మంది బాలికల జననాలు నమోదయ్యాయి. 2014-15లో ఇది 1000:921గా ఉండేది. మరోవైపు జాతీయస్థాయిలో 2023-24లో ఇదే నిష్పత్తి 1000:930గా ఉంది. గోవా, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో 2023-24లో బాలికల జననాలు అధికంగా ఉండగా.. లక్షద్వీప్, అండమాన్ నికోబార్, బిహార్‌లో తక్కువగా నమోదయ్యాయి.