News February 1, 2025
KMR: రుణాల దరఖాస్తు గడువు పొడిగింపు

కామారెడ్డి జిల్లాలో దివ్యాంగులకు జీవనోపాధి అవకాశాలు కల్పించేందుకు రుణాలు మంజూరయ్యాయని, వీటి కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారిని ప్రమీల తెలిపారు. బ్యాంకుతో సంబంధం లేకుండా 100 శాతం రాయితీతో రూ.50 వేల చొప్పున రుణాలు అందించనున్నట్లు వెల్లడించారు. దరఖాస్తు చేసుకునే గడువు వచ్చే నెల 12 వ తేదీ వరకు పొడిగించినట్లు ఆమె పేర్కొన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి సూచించారు.
Similar News
News July 6, 2025
పాలకుర్తిలో నేడే శూర్పణఖ వేషధారణ

పాలకుర్తి మండల కేంద్రంలో మొహర్రం పర్వదినాన్ని పురస్కరించుకుని గౌడ కులస్థులు ఆదివారం నిర్వహించబోయే శూర్పణఖ వేషధారణ విశేషంగా ఆకట్టుకోబోతోంది. బండి కొండయ్య గౌడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. డప్పు చప్పుళ్లతో, యువతీ యువకుల కేరింతలతో ఊరంతా దద్దరిల్లేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. శూర్పణఖను దర్శించుకుని స్పర్శిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇది ఆనవాయితీగా వస్తోంది.
News July 6, 2025
SRCL: వేములవాడలో విషాదం.. యువకుడి ఆత్మహత్య

వేములవాడ పట్టణంలోని మటన్ మార్కెట్ ఏరియాలో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల ప్రకారం.. దీటి వేణుగోపాల్- రాణి దంపతుల మొదటి కుమారుడు రోహిత్ (24) శనివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, మృతుడు కొంతకాలంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం బీటెక్ చదువుతున్నట్లు తెలిసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
News July 6, 2025
రేపటి నుంచి పెరగనున్న భక్తుల రద్దీ

నెల్లూరులోని బారాషహిద్ దర్గా వద్ద నేటి నుంచి రొట్టెల పండగ ప్రారంభం కానుంది. అన్ని గ్రామాల్లో జరుగుతున్న మొహర్రం వేడుకలు ఆదివారంతో ముగుస్తాయి. దీంతో నేడు బారాషహిద్ దర్గా వద్ద భక్తుల రద్దీ తక్కువగా ఉండే అవకాశం ఉంది. సోమవారం నుంచి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే దర్గా వద్ద పోలీస్ అధికారులు 1700 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.