News November 30, 2025
KMR: రెండో విడతలో 7 మండలాల్లో నామినేషన్

ఆదివారం నుంచి ప్రారంభమయ్యే గ్రామ పంచాయతీ రెండో విడత నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్‌ల పరిధిలోని 7 మండలాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అన్ని కేంద్రాలలో హెల్ప్ డెస్క్‌లు అందుబాటులో ఉంచారు.
Similar News
News December 3, 2025
ఎర్త్ సమ్మిట్ గ్రామీణాభివృద్ధికి ఉపయోగకరం: డీసీసీబీ ఛైర్మన్

గ్రామాలును అభివృద్ధి చేయటానికి ఎర్త్ సమ్మిట్ దోహదపడుతుందని విజయనగరం జిల్లా డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున బుధవారం తెలిపారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ సాంకేతికత, ఆర్థిక నూతన పరిష్కారాలపై దృష్టి సారిస్తూ, NABARD, (IAMAI)లతో కలిసి డిసెంబర్ 5,6 తేదీల్లో గుజరాత్ గాంధీనగర్‌లో నిర్వహిస్తున్న ఎర్త్ సమ్మిట్ 2025 జరుగుతుందన్నారు. బ్యాంక్ రైతులకు, మహిళా సంఘాలకు సేవలకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
News December 3, 2025
లింగ భైరవి దేవత గురించి మీకు తెలుసా?

ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు ప్రాణ ప్రతిష్ఠ చేసిన శక్తివంతమైన దేవీ స్వరూపమే ‘లింగ భైరవి’. తాంత్రిక యోగంలో అత్యంత శక్తిమంతమైన ‘భైరవి’ రూపమే లింగాకారంలో ఉండటం వలన దీనిని లింగభైరవి అని పిలుస్తారు. కోయంబత్తూరులో ఈ ఆలయం ఉంది. భక్తులు తమ జీవితంలో భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక సమతుల్యత, ఆరోగ్యం, వ్యాపారం కోసం ఈ అమ్మవారిని పూజిస్తారు. భైరవి సాధనతో భావోద్వేగ బుద్ధిని పెరుగుతుందని నమ్మకం.
News December 3, 2025
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి సుభాష్

రామచంద్రపురం మండలం కందులపాలెంలో బుధవారం జరిగిన ‘రైతన్నా-మీ కోసం’ కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. సీఎంఆర్ పద్ధతిలో రైతులకు గిట్టుబాటు ధర అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, ఆర్డీఓ అఖిల, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.


