News December 16, 2025

KMR: రేపే మూడో విడత ఎన్నికలు..ఓటర్లు ఎంతమందంటే

image

బాన్సువాడ డివిజన్ పరిధిలోని బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, డోంగ్లి, మద్నూర్, బిచ్కుంద, పెద్దకొడప్గల్, జుక్కల్ మండలాల్లోని 144 గ్రామాల్లో పోలింగ్ జరగనుంది. 2,01,885 ఓటర్లు ఉండగా 98,427 మంది పురుషులు, 1,03,452 మంది మహిళా ఓటర్లు, 6 ఇతరులు ఉన్నారు. 1,482 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటికే 26 సర్పంచ్, 441 వార్డు సభ్యులు ఏకగ్రీవం అయ్యారు. మిగతా గ్రామాల్లో రేపు పోలింగ్ జరగనుంది.

Similar News

News December 17, 2025

ఖాజీపేట: కానిస్టేబుల్‌ జాబ్ కొట్టిన హోమ్ గార్డు కుమారుడు

image

ఖాజీపేట పోలీస్ స్టేషన్‌లో హోమ్ గార్డ్‌గా పనిచేస్తున్న ప్రసాద్ కుమారుడు పవన్ కళ్యాణ్ పోలీసు ఉద్యోగానికి ఎంపికయ్యాడు. దీంతో బుధవారం పోలీస్ స్టేషన్ కార్యాలయంలో సీఐ వంశీధర్ పవన్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారికి పోలీస్ యూనిఫామ్ అందజేశారు. విధి నిర్వహణలో ప్రజలకు మంచి సేవలు అందించి ఉన్నతంగా రాణించాలని సూచించారు.

News December 17, 2025

సర్పంచ్ ఫలితాలు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే?

image

TG: మూడో విడతలో 3,752 సర్పంచ్ స్థానాలకు గాను ఇప్పటివరకు కాంగ్రెస్ మద్దతుదారులు 1,502, BRS 866, BJP 163, ఇతరులు 325 చోట్ల గెలిచారు. 26 జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఆదిలాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, ఆసిఫాబాద్, గద్వాల జిల్లాల్లో BRS లీడ్‌లో ఉంది. జనగామ, యాదాద్రి, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో కాంగ్రెస్-BRS మధ్య పోటీ తీవ్రంగా ఉంది. అటు నిర్మల్ జిల్లాలో బీజేపీ దూసుకెళ్తోంది.

News December 17, 2025

ప.గో: మరణంలోనూ వీడని బంధం

image

జీవితాంతం కలిసి నడిచిన ఆ దంపతులను మరణం కూడా విడదీయలేకపోయింది. తాడేపల్లిగూడెం (M) ఆరుగొలనుకు చెందిన మలకా అబద్ధం(75) అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. భర్త వియోగాన్ని తట్టుకోలేక బుధవారం సాయంత్రం భార్య లక్ష్మి(65) కూడా తుదిశ్వాస విడిచింది. దంపతులు ఇద్దరూ గంటల వ్యవధిలో మరణించడం గ్రామస్థులను కంటతడి పెట్టించింది.