News February 9, 2026
KMR: రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని మహిళ మృతి (UPDATE)

కామారెడ్డి పట్టణంలోని రైల్వే <<19085331>>ట్రాక్‌పై గుర్తు తెలియని ఓ మహిళ మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. రైల్వే ఎస్సై సాదు లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మహత్య చేసుకున్న మహిళ మహబూబ్ నగర్ జిల్లా వెంగళపల్లెకు చెందిన మీరిగల్ల సరోజనమ్మ(75)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 20, 2026
సిరిసిల్ల: హడలెత్తిస్తున్న చిరుత పులులు..!

వేములవాడ(R) మం. హనుమక్కపల్లిలో చిరుతపులి కలకలం రేపింది. గ్రామానికి చెందిన రోమాల భూమయ్యకు చెందిన లేగదూడపై చిరుత దాడిచేసి చంపింది. సమాచారం అందుకున్న అటవీశాఖ రేంజ్ అధికారి ఖలీలుద్దీన్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి చిరుతపులి అడుగులను గుర్తించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు. అడవుల్లో పశువులను కట్టొద్దని కోరారు. జిల్లాలో 5చిరుతలు తిరుగుతున్నట్లు తెలిపారు.
News February 20, 2026
పరిహారం త్వరితగతిన మంజూరు చేయాలి: జేసీ

కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుకు సంబంధించి జిల్లా విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమావేశం జేసీ నూరుల్ ఖమర్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పకడ్బందీగా అమలు చేయాలన్నారు. బాధిత కుటుంబాలకు ఉపాధి, ఇంటి స్థలం, అర్హత కలిగిన ఇతర ప్రయోజనాలను త్వరితగతిన మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
News February 20, 2026
దేవుడంటే వైసీపీకి గౌరవం లేదు: పయ్యావుల

AP: దేవుడి పట్ల వైసీపీకి ఏమాత్రం గౌరవం లేదని ఇవాళ్టి చర్యలతో నిరూపితమైందని మంత్రి పయ్యావుల కేశవ్ ఫైరయ్యారు. సభలోకి దేవుడి <<19190397>>ఫొటోలు<<>> తీసుకురావడంపై సహచర మంత్రులతో కలిసి మండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు ఫిర్యాదు చేశారు. వైసీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రెచ్చగొట్టే చర్యలతో సభను అడ్డుకోవాలని చూస్తే ఏమనుకోవాలని ప్రశ్నించారు. ప్లకార్డులో వెంకన్న ఫొటో వాడి చెప్పులతో ర్యాలీ చేస్తారా? అని నిలదీశారు.


