News February 15, 2025

KMR: లైంగిక దాడులను అరికట్టాలి: అదనపు కలెక్టర్

image

పాఠశాలలలో పిల్లలపై జరిగే లైంగిక దాడులను అరికట్టే దిశగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ సూచించారు. కలెక్టరేట్‌లో ఫోక్సో చట్టంపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ హాజరై.. చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్‌కి బ్యాడ్జీలు ప్రధానం చేశారు. జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 8, 2025

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ షెడ్యూల్

image

*ఇవాళ 1.30PMకు గవర్నర్ ఈ సదస్సును ప్రారంభిస్తారు
*ప్రజాపాలన, రెండేళ్లలో సాధించిన ప్రగతి, భవిష్యత్ ప్రణాళికలను సీఎం రేవంత్ రెడ్డి గెస్టులకు వివరిస్తారు
*3PM-7PM వరకు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి, కొరియా బృందం, ట్రంప్ మీడియా ప్రతినిధులు, అమెజాన్, ఐకియా, వరల్డ్ బ్యాంక్, SIDBI సహా వివిధ రకాల పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ అవుతారు.

News December 8, 2025

కరీంనగర్: పల్లె పెడదారి పడుతోంది..!

image

ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే పడే శిక్షలపై అభ్యర్థులకు అవగాహన లేకపోవడమే పల్లెపోరు పెడదారికి కారణమవుతోంది. ఉమ్మడి KNRలో కోల్ మైనింగ్, గ్రానైట్ ప్రాంతాల్లో ముఖ్యంగా రిజర్వేషన్ జనరల్ వచ్చిన గ్రామాల్లో అభ్యర్థులు మద్యం, వందలమందితో ప్రచారం, ఓటుకు నోటు ప్రలోభాలతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. కాగా, శాంతి భద్రతల పరిరక్షణ, మద్యం పంపకాలపై ఎక్సైజ్ యాక్ట్‌ల అమలులో అధికారుల ఉదాసీనత స్పష్టంగా కనిపిస్తోంది.

News December 8, 2025

హీరోయిన్‌కు వేధింపులు.. మలయాళ నటుడిని నిర్దోషిగా తేల్చిన కోర్టు

image

హీరోయిన్‌పై లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్‌ను కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఈ మేరకు కేరళలోని ఎర్నాకులం జిల్లా సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. ఆరుగురు నిందితులను దోషులుగా నిర్ధారించింది. వారికి శిక్షను ఈనెల 12న ప్రకటించనుంది. 2017లో సినీ నటిపై వేధింపుల కేసులో దిలీప్ అరెస్టయ్యారు. కొన్నాళ్లు జైలు జీవితం గడిపారు. దాదాపు 8 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ జరిగింది.