News April 5, 2025
KMR: లోన్ యాప్స్ వేధింపులకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలి

ఆన్‌లైన్ లోన్ యాప్‌ల వేధింపులు భరించలేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సదాశివనగర్‌కు చెందిన సందీప్(29) HYDలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం సందీప్ ఆన్‌లైన్ లోన్ యాప్స్ ద్వారా రుణం తీసుకున్నాడు. ఏజెంట్లు ఇబ్బందులు పెట్టడంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 3, 2025
చింతపండుకి గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న గిరిజనులు

శ్రీకాకుళంలోని ఏజెన్సీ ప్రాంతాలలో చింతపండు సేకరించే గిరిజనులు ఈ ఏడాది గిట్టుబాటు ధర లేక నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. గిరిజన కార్పొరేషన్ నుంచి గిట్టుబాటు ధర లభించక దళారీల దోపిడీకి గురవుతున్నారు. ఈ ఏడాది ఏజెన్సీలో మంచు ఎక్కువగా కురవటంతో చింతపండు ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. దీనికి తోడు గిట్టుబాటు ధర చెల్లించకపోవటంతో దళారీలకే చింతపండు తక్కువ ధరకు ఇచ్చేస్తున్నామని గిరిజనులు వాపోతున్నారు.
News September 3, 2025
జనగామ: సైన్స్ ల్యాబ్‌లు విద్యార్థుల్లో సృజనాత్మకత ప్రోత్సాహం: కలెక్టర్

సైన్స్ ల్యాబ్‌లు విద్యార్థుల సృజనాత్మకతను, వారి సొంత ఆలోచనలను ప్రోత్సహిస్తాయని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. పెంబర్తిలోని జడ్పీ హైస్కూల్‌లో అమెరికన్ ఇండియా ఫౌండేషన్, అట్లాసియాన్ ఎన్జీఓలు సంయుక్తంగా రూ. 15 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్‌లను కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
News September 3, 2025
CM చేతుల మీదుగా అవార్డు అందుకోనున్న చాగలమర్రి టీచర్

చాగలమర్రి జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల తెలుగు పండిట్‌గా పనిచేస్తున్న వి.లక్ష్మయ్య రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఈనెల 5న అమరావతిలో జరగనున్న ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఆయన అవార్డు తీసుకుంటున్నట్లు చాగలమర్రి మండల విద్యాశాఖ అధికారులు అనురాధ, న్యామతుల్లా తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును పొందిన లక్ష్మయ్యను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.