News March 27, 2025
KMR: వడ్డీ వ్యాపారులపై పోలీసుల కొరడా

కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలో అనుమతి లేని వడ్డీ వ్యాపారులపై బుధవారం పోలీసు అధికారులు దాడులు నిర్వహించారు. 69 దాడుల్లో.. 16 కేసులు నమోదు చేయగా, వారి వద్ద నుంచి విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ వడ్డీ వ్యాపారంతో అమాయకులను మోసం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
Similar News
News December 18, 2025
ఖమ్మం: పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్.!

ఉమ్మడి జిల్లా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయభేరి మోగించింది. మొత్తం 1,036 స్థానాలకు గాను, 9 చోట్ల ఎన్నికలు నిలవగా పోలింగ్ జరిగిన 1,027 పంచాయతీల్లో కాంగ్రెస్ 649 చోట్ల జయకేతనం ఎగురవేసింది. BRS-210,CPI-56,CPM-39 స్థానాల్లో విజయం సాధించాయి. స్వతంత్రులు 51 గ్రామాల్లో గెలవగా, మాస్‌లైన్, ఎన్డీ పక్షాలు 15 చోట్ల పట్టు నిలుపుకున్నాయి. పల్లెల్లో కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని స్పష్టంగా చాటుకుంది.
News December 18, 2025
VKB: పల్లే పోరులో.. ‘లక్కీ డ్రా’తో సర్పంచ్ పీఠం!

పంచాయతీ ఎన్నికల సమరంలో ఓట్ల వేట ఒకెత్తయితే.. అదృష్ట పరీక్ష మరోఎత్తు. VKB జిల్లాలో స్థానిక పోరులో రెండో విడతలో జైదుపల్లిలో ఇద్దరు అభ్యర్థుల మధ్య హోరాహోరీగా జరిగిన కౌంటింగ్‌లో ఒక ఓటు క్రాస్ కావటంతో శ్రీకాంత్ మౌనిక రెడ్డిని విజయం వరించింది. మూడో విడతలో దోమ మండలం పాలేపల్లిలో ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో లాటరీలో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన బచ్చిగారి సుజాత విజయం సాధించారు.
News December 18, 2025
సిరిసిల్ల: 4 మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం

ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్ నాలుగు మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు అధికంగా గెలిచారు. ఎల్లారెడ్డిపేటలో 11, ముస్తాబాద్‌లో 13, గంభీరావుపేటలో 11, వీర్నపల్లిలో 8, మొత్తం 43 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచారు. కాంగ్రెస్ 17 స్థానాలు, బీజేపీ 9, ఇండిపెండెంట్ అభ్యర్థులు 17, ఒక సీపీఐ అభ్యర్థి గెలిచారు.


