News August 25, 2025
KMR: వరల్డ్ ఐకాన్ అవార్డ్ అందుకున్న డా.రవీంద్ర మోహన్

ఎల్లారెడ్డి, పిట్లం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇన్‌ఛార్జ్ మెడికల్ సూపరింటెండెంట్ రవీంద్ర మోహన్ ‘మోస్ట్ కంపాషినెట్ సర్జన్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం అందుకున్నారు. దిల్లీలో జరిగిన ‘వరల్డ్ ఐకాన్ అవార్డ్స్’ వేడుకలో ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, ఎరిట్రియన్ అంబాసిడర్ అలెమ్ త్సేహాయ్ వోల్డెమరియమ్, ట్రేడ్ కమిషనర్ డాక్టర్ సెనోరిటా ఐజాక్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు.
Similar News
News August 25, 2025
అల్వాల్: Way2News Impact.. మరమ్మతులు

అల్వాల్ పరిధిలోని హెల్తీ బ్రెయిన్ ఆస్పత్రి నుంచి గోపాల్ నగర్ వెళ్లే మార్గంలో రోడ్డు గుంతల మయంగా మారి, అధ్వానస్థితికి చేరిందని ఆదివారం Way2News ఓ కథనాన్ని రాసింది. దీనిపై స్పందించిన అధికారులు రోడ్డు మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. అనేక చోట్ల గుంతలను సిమెంట్ కాంక్రీట్‌తో పూడ్చి వేసినట్లు పేర్కొన్నారు. వెంటనే స్పందించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
News August 25, 2025
రాయదుర్గం కేబుల్ బ్రిడ్జిపై ఉడిన స్టీల్ గేట్

రాయదుర్గం కేబుల్ బ్రిడ్జిపై స్టీల్ గేట్ ఊడిపోవడంతో నిబంధనల ఉల్లంఘన జరుగుతుందని ప్రజలు మండిపతున్నారు. అనేక మంది పర్యటకులు రోడ్డు మీదే ప్రమాదకరంగా సెల్ఫీలు దిగుతున్నట్లుగా పేర్కొన్నారు. రాయదుర్గం కేబుల్ బ్రిడ్జి వద్ద అనేక ఘటనలు జరుగుతున్నప్పటికీ కఠినచర్యలు అమలు కావటం లేదని ఆరోపించారు. వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.
News August 25, 2025
హైడ్రా చర్యలు పార్టీలకు అతీతం: రంగనాథ్

చట్టం అందరికీ ఒకే రకంగా వర్తిస్తుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. పాతబస్తీలోని సల్కం చెరువు పరిధిలోకి వస్తుందన్న ఫాతిమా కాలేజీ, మేడ్చల్ జిల్లాలోని మల్లారెడ్డి కాలేజీ, పల్లా రాజేశ్వర రెడ్డి కళాశాలైనా అన్నిట్లోనూ ఒకే విధానం హైడ్రాకు ఉందన్నారు. హద్దులు నిర్ధారించాకే చర్యలు చేపడతామని ఓ ప్రశ్నకు సమాధానంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు.