News August 15, 2025

KMR: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నాం: ఛైర్మన్

image

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల కోసం ప్రభుత్వం డైట్ ఛార్జీలను 40%, కాస్మెటిక్ ఛార్జీలను 200% పెంచిందని రాష్ట్ర వ్యవసాయ ఛైర్మన్ కోదండ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించే ఉద్దేశంతో మెనూ ఛార్జీలను కూడా గణనీయంగా పెంచామని ఆయన తెలిపారు. ఈ పెంపుదల వల్ల జిల్లాలోని 23,100 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.

Similar News

News August 16, 2025

కథలాపూర్: సౌదీ దేశం నుంచి స్వగ్రామానికి చేరిన మృతదేహం

image

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణరావుపేటకు చెందిన సంగెం వినోద్(30) సౌదీ అరేబియా దేశంలో గత నెల 22న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహం శుక్రవారం ఇంటికి చేరడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. వినోద్ ఉపాధి నిమిత్తం ఏడాది క్రితం సౌదీ అరేబియా దేశానికి వెళ్లాడు. అక్కడ కార్మికుడిగా పని చేస్తున్నప్పటికీ సరైన వేతనం లేదని మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.

News August 16, 2025

జగిత్యాల: ‘ఐకమత్యంతోనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం’

image

జర్నలిస్టులు ఐకమత్యంగా ఉంటేనే వారి సమస్యలు పరిష్కారమవుతాయని TUWJ (IJU) JGTL జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు అన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం JGTLలో ప్రెస్ క్లబ్, ధరూర్‌ క్యాంపులో ఉన్న జిల్లా కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణ చారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగుల గోపాల చారి తదితరులు పాల్గొన్నారు.

News August 16, 2025

వేములవాడ: ఫైర్ స్టేషన్ అధికారికి ఉత్తమ సేవా పురస్కారం

image

వేములవాడ ప్రథమ అగ్నిమాపక అధికారి బి.రాజేంద్ర ప్రసాద్ ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన వేడుకల్లో విధి నిర్వహణలో ఆయన చూపిన ఉత్తమ ప్రతిభకు గాను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్‌ను పలువురు అభినందించారు.