News February 14, 2025
KMR: విద్యార్థుల సేఫ్టీకి..జిల్లా కలెక్టర్ తొలి అడుగు..!

పాఠశాలలో విద్యార్థులపై లైంగిక దాడులు జరగకుండా ఉండేందుకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తొలి అడుగు వేశారు. తెలంగాణలోనే మొట్టమొదటి సారిగా కామారెడ్డి జిల్లాలో ప్రతి పాఠశాల నుంచి ఒక చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్‌ను నియమించారు. శుక్రవారం కళాభారతిలో సమావేశం నిర్వహించి పోక్సో చట్టం పై ఓరియన్టేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోక్సో చట్టంలో నిర్దేశితమైన బాధ్యతల గురించి వివరించారు.
Similar News
News February 15, 2026
‘ఫుడ్ జిహాద్’ పేరుతో వేధిస్తారా.. ఒవైసీ ఆగ్రహం

TG: మేడారం జాతరలో కర్నూలుకు చెందిన చిరువ్యాపారి వలీని వేధించిన యూట్యూబర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. వ్యూస్ కోసం పేద వ్యాపారిని అవమానించడం, మత రంగు పులిమి వేధించడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. కేవలం రూ.10కి కోవా బన్ను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తిని ‘ఫుడ్ జిహాద్’ పేరుతో భయభ్రాంతులకు గురిచేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.
News February 15, 2026
కాళేశ్వరంలో శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలించిన ఎస్పీ

మహా శివరాత్రి సందర్భంగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను ఎస్పీ సంకీర్త్ పరిశీలించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున పోలీస్ బందోబస్తును మరింత పటిష్ఠంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. పుష్కర ఘాట్, తెప్పోత్సవం జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. ట్రాఫిక్ నియంత్రణ కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు.
News February 15, 2026
మక్తల్: NH–167 విస్తరణకు కేంద్రం ఆమోదం

హైదరాబాద్–పనాజీ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా గుడిబండార్–మహబూబ్‌నగర్ మధ్య జాతీయ రహదారి–167ను 4 లేన్లుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 80.01 కిలోమీటర్ల పొడవుతో రూ.3,175.08 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. ఈ రహదారి MBNR, NRPT జిల్లాల మీదుగా వెళ్లి సుమారు 32 లక్షల మంది ప్రజలకు ప్రత్యక్ష, పరోక్ష ప్రయోజనాలు అందించనుంది. దీంతో రవాణా సౌకర్యాలు మెరుగు పడనుంది.


