News November 11, 2025
KMR: వీధి కుక్కల బెడదకు చెక్ పడుతుందా?

వీధి కుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జన రద్దీ ఉండే ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కామారెడ్డి జిల్లాలో కూడా వీధి కుక్కల దాడికి గురై అనేక మంది గాయాలపాలైన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జిల్లా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 11, 2025
కేసీ కెనాల్‌లో పడిన మహిళను కాపాడిన హమాలీలు

బండి ఆత్మకూర్ సమీపంలో కేసీ కెనాల్ కాలువలో ప్రమాదవశాత్తు పడిన మహిళను హమాలీలు కాపాడారు. సోమవారం ఎస్ఐ జగన్మోహన్ వివరాల మేరకు.. బోయ రేవులకు చెందిన చాబోలు ఓబులమ్మ(60) వారధి వద్ద చిన్న గుడిలో భోజనం చేసి చేయి కడుక్కునేందుకు బీసీ కాలువ వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తు అందులో పడింది. అక్కడే లారీకి లోడ్ ఎత్తుతున్న హమాలీలు ఆమెను గుర్తించి కాపాడారు. పోలీస సిబ్బంది ఆమెను తన కొడుకు అప్పగించారు.
News November 11, 2025
వ్యక్తికి జీవిత ఖైదు, రూ.15 వేలు జరిమానా

గోకవరం (M) బాబాజీ పేట గ్రామానికి చెందిన బలిజ శ్రీనుకు రాజమండ్రి జిల్లా కోర్టు యావజ్జీవ ఖైదుతో పాటు రూ.15 వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు SI పవన్ కుమార్ సోమవారం తెలిపారు. శ్రీను 2020లో అదే గ్రామానికి చెందిన వి. శ్రీనును హత్య చేశాడు. గోకవరం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు. వాదోపవాదములు విన్న తర్వాత హత్య నేరం రుజువు కావడంతో జిల్లా జడ్జి మాధురి తీర్పు వెలువరించారు.
News November 11, 2025
ఆయిల్ స్కిన్ ఉందా? ఇలా చేయండి

ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్లు ముస్తాబైన కాసేపటికే.. వెంటనే ముఖమంతా జిడ్డుగా మారిపోతుంది. ఇలాకాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి. * ముల్తానీమట్టి, రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని చర్మానికి అప్లై చేసి 15నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే జిడ్డు తగ్గుతుంది. * రోజులో కనీసం రెండుసార్లు ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే జిడ్డుదనం తగ్గుతుంది.


