News March 29, 2025
KMR: వేసవిలో చోరీలు తస్మాత్ జాగ్రత్త: SP

వేసవిలో చోరీల నివారణకు KMR జిల్లా SP రాజేశ్ చంద్ర ప్రజలకు పలు సూచనలు చేశారు. రాత్రి వేళ ఆరుబయట నిద్రించే సమయంలో ఒంటిపై ఆభరణాలు ధరించొద్దన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని DVRని రహస్య ప్రదేశంలో ఉంచాలన్నారు. తమ టూర్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో షేర్ చేయొద్దన్నారు. ఊళ్లకు వెళ్లే వారు ఇంట్లో లైటు వేసి ఉంచాలన్నారు. కొత్త వ్యక్తుల కదలికలపై డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Similar News
News April 1, 2025
IPL: నేడు లక్నోతో పంజాబ్ కింగ్స్ ఢీ

IPLలో భాగంగా ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు లక్నోలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఆడిన తొలి మ్యాచులోనే పంజాబ్ ఘన విజయం సాధించి జోరు మీద ఉంది. ఈ మ్యాచులో కూడా గెలిచి 2 పాయింట్లు తమ ఖాతాలో వేసుకోవాలని శ్రేయస్ అయ్యర్ సేన భావిస్తోంది. మరోవైపు లక్నో తొలి మ్యాచులో ఓటమిపాలైనా, రెండో మ్యాచులో SRHపై గెలిచింది. ఇదే జోరులో పంజాబ్‌ను ఓడించాలని యోచిస్తోంది.
News April 1, 2025
గద్వాల: ‘ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలి’

రాజీవ్ యువ వికాస పథకానికి వీలైనంత ఎక్కువ మంది అర్హులు దరఖాస్తులు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం రాజీవ్ యువ వికాసం పథకంపై హైదరాబాద్ నుంచి మంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో గద్వాల జిల్లా నుంచి కలెక్టర్ సంతోష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News April 1, 2025
అమరచింత: రాత్రి వేళైనా కొనసాగుతున్న మున్సిపల్ వసూళ్లు

వనపర్తి జిల్లా అమరచింత మున్సిపల్ కేంద్రంలో సోమవారం రాత్రి 8 గంటలైనా మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ పన్నును వసూలు చేస్తున్నారు. దీనిపై పలువురు లబ్ధిదారులు పండుగ పూట, రాత్రయినా వసూలు చేస్తున్నారని వాపోయారు. అయినా ఆర్థిక సంవత్సరం ముగుస్తుందని తెలపడంతో తప్పని పరిస్థితిలో చెల్లిస్తున్నట్లు లబ్ధిదారులు పేర్కొన్నారు.