News March 21, 2025

KMR: వైద్యుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

కామారెడ్డి జిల్లా లోని వైద్య విధాన పరిషత్‌లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా డీసీహెచ్ఎస్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. బాన్సువాడ, దోమకొండ, మద్నూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఏరియా, సామాజిక ఆసుపత్రుల్లో 19 వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అర్హత కలిగిన వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిలో ఇంటర్వ్యూలు నిర్వహించి భర్తీ చేస్తామన్నారు.

Similar News

News July 5, 2025

ఒక టెస్టులో అత్యధిక పరుగులు వీరివే

image

* గ్రాహం గూచ్(ENG)- 456(333, 123)
* శుభ్‌మన్ గిల్(IND)-430(269, 161)
* మార్క్ టేలర్(AUS)-426(334, 92)
* సంగక్కర(SL)-424(319, 105)
* బ్రియన్ లారా(WI)-400(ఒకే ఇన్నింగ్సు)
* గ్రెగ్ చాపెల్(AUS)-380(247, 133)
* హేడెన్(AUS)-380(ఒకే ఇన్నింగ్సు)
* సందమ్(ENG)-375(325, 50)

News July 5, 2025

విపత్తుల నిర్వహణ అందరి బాధ్యత: జాయింట్ అడ్వైజర్

image

విపత్తుల నిర్వహణ అందరి బాధ్యత అని జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ జాయింట్ అడ్వైజర్ నావల్ ప్రకాష్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ కింద ఏర్పాటైన ఆపదమిత్ర వాలంటీర్లు, జిల్లా అధికారులతో చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వరదలు, తుపాన్లు, భూకంపాలు, ప్రమాదాలు సంభవించినప్పుడు సహాయం చేసేందుకు జిల్లాలోనూ ఆపద మిత్రులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News July 5, 2025

విశాఖలో టాస్క్‌ఫోర్స్‌కు అదనపు సిబ్బంది

image

విశాఖలో టాస్క్ ఫోర్స్ బలోపేతం చేసేలా పోలీస్ కమిషనర్ చర్యలు తీసుకున్నారు. ఇద్దరు సీఐల పర్యవేక్షణలో టాస్క్ ముమ్మరంగా దాడులు చేస్తున్న నేపథ్యంలో విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే వారికి ప్రాధాన్యత ఇస్తూ మరో ఏడుగురి సిబ్బందిని నియమించారు. భీమిలి ఎస్ఐ హరీశ్‌తో పాటు ఒక హెడ్ కానిస్టేబుల్, మరో ఐదుగురు కానిస్టేబుళ్లను టాస్క్‌ఫోర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.