News October 24, 2025

KMR: వైన్స్ దరఖాస్తుల గడువు ముగింపు..1502 దరఖాస్తులు

image

వైన్స్ షాపుల లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకునే గడువు ముగిసింది. కామారెడ్డి జిల్లాలోని 49 షాపుల వైన్స్ షాపులకు గాను 1502 దరఖాస్తులు అందినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంత్ రావు గురువారం Way2Newsకు తెలిపారు. అయితే, గత ఏడాది వచ్చిన దరఖాస్తులతో పోలిస్తే ఈసారి సంఖ్య తగ్గింది. గతేడాది 2204 దరఖాస్తులు వచ్చాయి.

Similar News

News October 24, 2025

కోటనందూరులో అత్యధిక వర్షపాతం

image

కాకినాడ జిల్లాలో గురువారం ఉదయం 8:30 నుంచి శుక్రవారం ఉదయం 6:30 వరకు 500.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సమాచార శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో సగటు వర్షపాతం 23.8 మి.మీ.గా నమోదైంది. అత్యధికంగా కోటనందూరులో 94 మి.మీ., అత్యల్పంగా గండేపల్లిలో 1.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. మొత్తం 21 మండలాల్లో వర్షాలు కురిసినట్లు అధికారులు పేర్కొన్నారు.

News October 24, 2025

రాష్ట్రంలో 121 పోస్టులు… అప్లైకి ఎల్లుండే ఆఖరు తేదీ

image

ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్‌లో 121 ఫ్యాకల్టీ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే (OCT 26) ఆఖరు తేదీ. పోస్టును బట్టి MBBS, MD/MS, M.Ch, DM ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. Asst ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్‌ పోస్టులకు గరిష్ఠంగా 50ఏళ్లు, ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్ పోస్టులకు 58ఏళ్లు మించరాదు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. *మరిన్ని <<-se_10012>>ఉద్యోగ<<>> నోటిఫికేషన్ల కోసం జాబ్స్ కేటగిరీకి వెళ్లండి.

News October 24, 2025

జమ్మూ ఎయిమ్స్‌లో 80 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

జమ్మూలోని ఎయిమ్స్‌లో 80 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతలుగల అభ్యర్థులు అప్లై చేసుకుని హార్డ్ కాపీని ఈనెల 28లోగా పంపాలి. ఇంటర్వ్యూ / రాత పరీక్ష /ఆబ్జెక్టివ్ ప్రమాణాల ఆధారంగా స్క్రీనింగ్ చేయవచ్చు. పోస్టును బట్టి DNB, MD/MS/DM/M.Ch ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. వెబ్‌సైట్: https://www.aiimsjammu.edu.in/