News April 2, 2025
KMR: సన్నం బియ్యం పంపిణీ ప్రారంభించిన కలెక్టర్

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో సన్నం బియ్యం పథకాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బియ్యం నాణ్యతను, తూకాన్ని ఆయన పరిశీలించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సన్న బియ్యం అందుతాయని కలెక్టర్ తెలిపారు. పంపిణీ ప్రక్రియ సజావుగా జరిగేలా రేషన్ షాపుల్లో అధికారులతో తనిఖీలు చేయించినట్లు పేర్కొన్నారు.
Similar News
News April 3, 2025
MBNR: ‘స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించాలి’

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని, దీనిపై గవర్నర్ దగ్గర సంతకం పెట్టించి అమల్లోకి తీసుకురావాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరారు. ఈ బిల్లుకు తాము అసెంబ్లీలో మద్దతు ఇచ్చామని, రేపు పార్లమెంట్‌కు వస్తే, అక్కడ కూడా మద్దతు ఇస్తామన్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు.
News April 3, 2025
13న ఓటీటీలోకి ‘కింగ్స్టన్’

మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ ‘కింగ్స్టన్’ మూవీ ఈ నెల 13న జీ5 ఓటీటీలోకి రానుంది. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు జీ తమిళ్లో ప్రసారం కానుంది. ఈ చిత్రంలో దివ్యభారతి హీరోయిన్గా నటించారు. మార్చి 7న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.
News April 3, 2025
జడ్చర్లలో జోరుగా వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు

జడ్చర్ల బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. నేడు మార్కెట్ యార్డ్‌లో క్వింటాల్ కందులకు గరిష్ఠంగా 6,879, ఆముదాలు 6,353, వేరుశనగ 6,769, జొన్న 4,011, బొబ్బర్లు 5,656, మొక్కజొన్నలు 2,268, ఆర్ఎన్ఆర్ రకం వడ్లు 2,059, మినుములు 7,316 ధర పలికాయి. నేడు మొత్తంగా మార్కెట్ యార్డ్‌కు 132 మంది రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులు విక్రయానికి తీసుకొచ్చారు.