News January 22, 2026
KMR: సమన్వయమే అసలైన సవాలు

కామారెడ్డి జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రస్తుతం తిరుగులేని జోరు ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలో అధికారంతో పాటు జిల్లా నేతలు ప్రభుత్వంలో ఉండటం పార్టీకి కొండంత బలాన్నిస్తోంది. బీఆర్ఎస్ నుంచి కీలక నేతల వలసలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. అయితే భారీ చేరికలే పార్టీకి కొత్త తల నొప్పులు తెచ్చేలా ఉన్నాయి. పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం కుదర్చడం ఇప్పుడు నాయకత్వానికి పెద్ద పరీక్షగా మారింది.
Similar News
News February 9, 2026
‘SIR’కు అడ్డంకులు సృష్టించొద్దు.. సుప్రీంకోర్టు హెచ్చరిక

‘SIR’ ప్రక్రియను వ్యతిరేకిస్తూ WB ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై SC కీలక వ్యాఖ్యలు చేసింది. ‘సర్’ ప్రక్రియలో అడ్డంకులు సృష్టించొద్దని హెచ్చరించింది. మరోవైపు 300 మంది అధికారులను కోరితే ప్రభుత్వం 80 మందిని మాత్రమే ఇచ్చిందని EC కోర్టుకు తెలిపింది. స్థానికతను నిరూపించుకోవడానికి ఓటర్లకు ఈసీ ఒక్క అవకాశమూ ఇవ్వలేదని ప్రభుత్వం వాదించింది. దీంతో గడువును వారం రోజులపాటు పొడిగిస్తున్నట్లు SC తెలిపింది.
News February 9, 2026
రావులపాలెం: టీ తాగడానికి వెళ్తే మృత్యువు కబళించింది

రావులపాలెం మండలం ఊబలంకలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బండారు వెరయ్య (79) మృతి చెందాడు. టీ తాగడానికి వచ్చిన వృద్ధుడిని రావులపాలెం నుంచి ఆత్రేయపురం వెళ్తున్న లారీ అతివేగంగా ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. మృతుని కుమారుడు బండారు వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI కేవీ రమణారెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
News February 9, 2026
విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలి: కలెక్టర్

హన్మకొండ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్‌లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్యను కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నివేదిక అందజేయాలని సూచించారు. టెన్త్ విద్యార్థులకు పరీక్షల సమయం దగ్గరపడుతోందని ఆరోగ్యంగా ఉంటేనే చదువులో రాణిస్తారని చెప్పారు.


