News December 20, 2025

KMR: సర్పంచ్ సాబ్ రాకకు గ్రామం సిద్ధం!

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పల్లె పోరు ముగిసి, నూతన నాయకత్వం కొలువుదీరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22న జిల్లాలోని అన్ని జీపీల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయాలను అధికారులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పంచాయతీ భవనాలకు రంగులు వేయడం, అలంకరించడం వంటి పనులు వేగంగా జరుగుతున్నాయి.

Similar News

News December 24, 2025

గర్భనిరోధక మాత్ర ఎలా పని చేస్తుందంటే?

image

ఈ టాబ్లెట్లలో లెవోనోర్‌జెస్ట్రల్‌ అనే హార్మోన్‌ ఉంటుంది. ఇది సహజంగా లభించే స్త్రీ సెక్స్ హార్మోన్ ప్రొజెస్టెరాన్ సింథటిక్ వెర్షన్. ఓవులేషన్ సమయంలో అండం విడుదల అవుతుంది. అయితే ఈ టాబ్లెట్‌ తీసుకోవడం వల్ల ఆ ప్రక్రియ వాయిదా పడుతుంది. అండం ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేయడం, ఫలదీకరణాన్ని నిరోధించడం వంటివి చేస్తుంది. అలాగే ఫలదీకరణం అయిన అండం గర్భాశయంలో అమర్చబడకుండా చేసి గర్భధారణను నిరోధిస్తుంది.

News December 24, 2025

నిజామాబాద్: పలువురు సబ్ స్పెక్టర్ల బదిలీ

image

NZB పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న సబ్ స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. NZB వీఆర్ లో ఉన్న శ్రీనివాస్‌ను ధర్పల్లి SHOగా, అక్కడ ఉన్న కళ్యాణిని వీఆర్‌కు, వీఆర్‌లో ఉన్న జీ. వంశీ కృష్ణను వర్ని, వర్నిలో ఉన్న మహేశ్ వీఆర్‌కు, నవీపేట్ అటాచ్డ్ ఎస్సైగా ఉన్న తిరుపతిని భీమ్గల్౨కు, భీంగల్ ఎస్సై సందీప్‌ను 4వ టౌన్‌కు బదిలీ చేశారు.

News December 24, 2025

ప.గో: అకౌంట్లో నుంచి రూ.90 వేలు కట్.. ఎలాగో తెలిస్తే షాక్!

image

వాట్సాప్‌కు వచ్చిన లింక్‌ను క్లిక్ చేసిన ఓ వ్యక్తి రూ.90 వేలు పోగొట్టుకున్నారు. ఉమ్మడి ప.గో జిల్లా ఏలూరులోని దక్షిణపు వీధికి చెందిన సత్యనారాయణకు ఈనెల 17న ‘ఎం-పరివాహన్’ పేరుతో మెసేజ్ రాగా, దాన్ని ఓపెన్ చేయగానే ఖాతా నుంచి నగదు మాయమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏలూరు వన్‌టౌన్ ఎస్సై సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అపరిచిత లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.