News March 6, 2025
KMR: సారీ మమ్మీ, డాడీ.. ఇక సెలవు

కోరుకున్న ఉద్యోగం రాలేదని మనస్తాపానికి గురై ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన ఈ నెల 3న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిట్లం మండలం కోమటి చెర్వు తండాకు చెందిన అశోక్ HYDలో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. 3వతేదీన ఇంటి నుంచి వెళ్లి పోయాడు. ‘కోరుకున్న జాబ్ సాధించలేక పోయా.. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎపుడప్పుడూ చనిపోవాలని ధ్యాస ఒక్కటే.. ఇక సెలవు. సారీ మమ్మీ, డాడీ’ అంటూ లేఖ రాసి అదృశ్యమయ్యాడు.
Similar News
News November 7, 2025
WGL: తేజా మిర్చి రూ.14,850

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో శుక్రవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు నిన్న రూ.17,100 ధర పలకగా.. నేడు రూ.17,200 అయింది. అలాగే, వండర్ హాట్(WH) మిర్చికి గురువారం రూ.17,300 ధర వస్తే.. ఈరోజు రూ.17,200కి తగ్గింది. తేజ మిర్చి ధర నిన్న రూ.14,800 ఉంటే.. శుక్రవారం రూ.14,850 అయింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
News November 7, 2025
సరస్వతీ దేవి ఎలా జన్మించింది?

పూర్వం సృష్టి శూన్యంగా ఉండేది. దీంతో బ్రహ్మ దేవుడు లోకాన్ని సృష్టించాలనుకున్నాడు. ఆ కార్యాన్ని ప్రారంభించడానికి అతనికి జ్ఞానం, వాక్కు అవసరమయ్యాయి. అప్పుడు బ్రహ్మ తన మనస్సు నుంచి తేజోమయి సరస్వతీ దేవిని సృష్టించాడు. ఆమె వీణ, పుస్తకం, జపమాల ధరించి, ఆవిర్భవించింది. బ్రహ్మకు వాక్కు, జ్ఞానం అందించింది. ఆమె అనుగ్రహంతోనే బ్రహ్మ వేదాలను, సమస్త విశ్వాన్ని సృష్టించగలిగాడు. అందుకే బ్రహ్మ మానస పుత్రిక అంటారు.
News November 7, 2025
భారీ జీతంతో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంలో ఉద్యోగాలు

<


