News July 7, 2024
KMR: సీఎం ఓవర్సీస్ స్కాలర్ షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే పేద మైనార్టీ విద్యార్థులు సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి దయానంద్ తెలిపారు. ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన్, పార్శి మతాలకు చెందిన విద్యార్థులు ఆగస్టు 8లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News March 2, 2026
NZB: హోలీ పండుగకు పటిష్ట భద్రత ఏర్పాట్లు: సీపీ

హోలీ పండుగ నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు నిజామాబాద్ సీపీ సాయి చైతన్య సోమవారం పేర్కొన్నారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో సహజసిద్ధమైన రంగులతో పండుగను జరుపుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో స్నానాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై దృష్టి సారించాలన్నారు.
News March 2, 2026
NZB: అదనపు కలెక్టర్‌గా దిలీప్ కుమార్ బాధ్యతలు

నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన అంకిత్ భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్లడంతో ప్రభుత్వం దిలీప్ కుమార్‌ను ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. బాధ్యతల స్వీకారం అనంతరం ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. పలువురు అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
News March 2, 2026
NZB: హోలీ వేళ పోలీసుల ఆంక్షలు.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

హోలీ పండుగ సందర్భంగా నిజామాకబాద్ జిల్లా ప్రజలు పోలీసు నిబంధనలు పాటించాలని సీపీ సాయి చైతన్య సూచించారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో ఇతరులపై లేదా వాహనాలపై బలవంతంగా రంగులు, నీటిని చల్లడం నిషేధమని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే నిజామాబాద్ పోలీస్ చట్టం సెక్షన్ 76 ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఆంక్షలు ఈనెల 2వ తేదీ సాయంత్రం 6 నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయన్నారు.


