News April 7, 2025

KMR: సుప్రీంకోర్టు న్యాయవాదిని కలిసిన ప్రభుత్వ సలహాదారు

image

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ కుర్షిద్‌ను ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వక్ఫ్ బోర్డ్ చట్టంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జావిద్ అహ్మద్ తదితరులు ఉన్నారు.

Similar News

News November 3, 2025

తగ్గుతున్న ఆకుకూరల సాగు.. కారణమేంటి?

image

ఒకప్పుడు చాలా రకాల ఆకుకూరల లభ్యత, వినియోగం ఉండేది. ఇప్పుడు తోటకూర, మెంతి కూర, పాలకూర, పుదీనా, గోంగూర, కొత్తిమీర, బచ్చలికూరలనే మనం ఎక్కువగా వినియోగిస్తున్నాం. ఆకుకూరల సాగులో రైతుల కష్టం ఎక్కువగా ఉండటం, వరద ముంపునకు గురైతే పంట పూర్తిగా నష్టపోవడం వంటి కారణాల వల్ల.. రైతులు ఎక్కువ ధర పలికే కూరగాయలు, ఇతర వాణిజ్య పంటల సాగువైపు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా కాలక్రమేణా ఆకుకూరల సాగు, వినియోగం తగ్గుతోంది.

News November 3, 2025

టేకులపల్లి: ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

image

టేకులపల్లి మండలం కొండగులబోడు గ్రామానికి చెందిన భూక్యా వినోద్(28) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొత్తగూడెం హోండా షోరూంలో వినోద్ పని చేస్తున్నాడు. సెలవు దినం కావడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెప్పారు. వ్యవసాయ పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు కొడుకు ఉరి వేసుకుని విగత జీవిగా కనిపించాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News November 3, 2025

శక్తిమంతమైన శివ మంత్రాలు

image

1. ఓం నమః శివాయ
2. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
3. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్
4. కర్పూర్ గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం
సదావసంతం హృదయారవిందే భవం భవానీసహితం నమామి
5. క‌రచరణా కృతం వా కాయ‌జం క‌ర్మజం వా
శ్రవ‌న్నయ‌న‌జం వా మాన‌సం వా ప‌ర‌ధాం విహితం విహితం వా
స‌ర్వ మేత‌త క్షమ‌స్వ జ‌య జ‌య క‌రుణాబ్దే శ్రీ మ‌హ‌దేవ్ శంభో