News April 26, 2024
KMR: సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి: DSP
సైబర్ నేరాల పట్ల ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని KMR DSP నాగేశ్వర రావు తెలిపారు. బస్వాపూర్‌లో సైబర్ నేరాల పట్ల అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకూడదని సూచించారు. గ్రామ రక్షక దళాలు అద్భుతంగా పనిచేయడం వల్ల నేరాలు నియంత్రణలో ఉన్నాయన్నారు. అందుకు సహకరిస్తున్న యువతను ఆయన అభినందించారు. బిక్కనూరు CI సంపత్ కుమార్, SI సాయికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News January 9, 2025
కోటగిరి: రెండు బైకులు ఢీ ఒకరు మృతి
కోటగిరి నుంచి ఎత్తోండ వెళ్లే రోడ్డుపై బుధవారం రెండు బైకులు ఢీ కొనడంతో లక్ష్మణ్(55) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. లక్ష్మణ్ తన పొలం నుంచి కోటగిరికి తిరిగి వెళ్తుండగా మరో వ్యక్తి కోటగిరి నుంచి ఎత్తోండ వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎత్తోండకు చెందిన వ్యక్తికి గాయాలవడంతో 108 అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని ఎస్ఐ సందీప్ సందర్శించి వివరాలను సేకరించారు.
News January 9, 2025
NZB: రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
నిజామాబాద్ నగర శివారులో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు. నిజామాబాద్-జాన్కంపేట రైల్వే స్టేషన్ పరిధిలోన బుధవారం సాయంత్రం రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృత దేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి వివరించారు.
News January 9, 2025
NZB: రైల్వే స్టేషన్ ప్రాంతంలో వృద్ధుడు మృతి
నిజామాబాద్ వన్ టౌన్ పరిధిలో గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైనట్లు SHO రఘుపతి బుధవారం తెలిపారు. రైల్వే స్టేషన్ ఎదురుగా దర్గా వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెంది ఉండటంతో స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వివరించారు.