News August 26, 2025

KMR: హత్యాయత్నం కేసులో.. ముగ్గురికి మూడేళ్ల జైలు

image

హత్యాయత్నం కేసులో ముగ్గురికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చినట్లు KMR ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. 2021లో బిచ్కుంద మండలం ఖత్గాంకు చెందిన చందును పాత కక్షల కారణంగా రాథోడ్ శంకర్, రాథోడ్ మారుతి, గణేశ్‌లు దాడి చేసి గాయపరిచారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. వీరిని కోర్టులో హాజరుపరచగా సోమవారం తీర్పు వెలువరించారు.

Similar News

News August 27, 2025

విశాఖ: తల్లిని చంపిన కుమార్తెలు.. కారణమిదే!

image

బంకెల సంతు(37)ను కన్న <<17524610>>కూతుర్లే<<>> తమ బాబాయ్ సాయంతో చంపిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబందించిన కీలక విషయాలను అనకాపల్లి SP తుహీన్ సిన్హా మంగళవారం వెల్లడించారు. భర్తతో విడిపోయిన సంతు తన కుమార్తెలతో కలిసి విశాఖలో ఉంటోంది. ఆమె బెట్టింగులకు, చెడు వ్యసనాలకు బానిస కావడంతో ఇంట్లో గొడవలు జరిగేవి. ఇటీవల తల్లి ఫోన్‌లో అసభ్యకర దృశ్యాలు చూసిన చిన్న కుమార్తె అక్కకు చెప్పడంతో విసిగిపోయి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

News August 27, 2025

యూరియా వస్తుంది, రైతులు ఆందోళన చెందవద్దు: మంత్రి కొలుసు

image

యూరియా సరఫరా జరుగుతుందని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. నూజివీడులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎరువులు, ముఖ్యంగా యూరియా లభ్యతపై సీఎం చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఇంటెలిజెన్స్, వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారని తెలిపారు. రైతులకు ఎటువంటి కొరత లేకుండా ఎరువులు సరఫరా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

News August 27, 2025

ఒలింపిక్స్ నిర్వహణకు ప్రభుత్వం ఆసక్తి.. రేపు కీలక సమావేశం

image

ఒలింపిక్స్-2036 నిర్వహణకు TG ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. బిడ్ వేయడానికి గల అవకాశాలపై చర్చించేందుకు రేపు స్పోర్ట్స్ హబ్ బోర్డ్ సమావేశం కానుంది. దీనికి CM రేవంత్ రెడ్డి సహా కపిల్‌దేవ్, పుల్లెల గోపీచంద్, బైచుంగ్ భూటియా, అభినవ్ బింద్రా, ఉపాసన, కావ్యా మారన్, సంజీవ్ గొయెంకా తదితరులు హాజరుకానున్నారు. స్పోర్ట్స్ అకాడమీలు, స్టేడియాల ఆధునికీకరణ, క్రీడాకారులకు మౌలిక సదుపాయాల కల్పనపైనా చర్చించనున్నారు.