News February 26, 2026
KMR: 120 డీలర్లకు సర్టిఫికెట్లు అందజేసిన కలెక్టర్

కామారెడ్డి జిల్లాలో బుధవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధ్యక్షతన డీఏఈఎస్‌ఐ శిక్షణ పూర్తి చేసిన 120 ఇన్‌పుట్ డీలర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. 2023-24 బ్యాచ్‌లో బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి మండలాల నుంచి 40 మంది డీలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫర్టిలైజర్ యాప్, రైతు బీమా అంశాలపై ADA, MAOలతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ క్లెయిమ్‌లకు సంబంధించిన పత్రాలను వేగంగా పూర్తి చేయాలన్నారు.
Similar News
News April 20, 2026
@4PM సింహాచలం: స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారంటే..!

సింహాచలంలో స్వామి నిజరూప దర్శనం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు 81,238 మంది స్వామిని దర్శించుకున్నట్టు అధికారులు వెల్లడించారు. క్యూ లైన్లలో బారులు తీరారు. వీరికి ఇబ్బంది కలగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే 6గంటల తరువాత భక్తులకు కొండ పైకి అనుమతించడం లేదన్నారు.
News April 20, 2026
NGKL: ఈ నెల 30న దత్తాత్రేయ ఆశ్రమానికి ప్రత్యేక బస్సు

NGKL ఆర్టీసీ డిపో నుంచి ఈనెల 30న కర్ణాటకలోని గానుగాపూర్ దత్తాత్రేయ ఆశ్రమానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. ఈ బస్సు 30న రాత్రి డిపో నుంచి బయలుదేరి మే 1న శనివారం తెల్లవారుజామున దత్తాత్రేయ ఆశ్రమానికి చేరుకుంటుందన్నారు. ఉదయం దత్తాత్రేయ స్వామి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో యానగుంది మానికేశ్వరీ మాత ఆశ్రమ దర్శనం ఉంటుందన్నారు. వివరాలకు 9490411591 సంప్రదించాలన్నారు.
News April 20, 2026
సేంద్రియ మేళా సూపర్ హిట్: కలెక్టర్

లూరులో నిర్వహించిన ‘రైతు సంపద’ సహజ, సేంద్రియ ఉత్పత్తుల మెగా మేళా విశేష స్పందనతో విజయవంతమైందని కలెక్టర్ వెట్రి సెల్వి సోమవారం తెలిపారు. రెండు రోజుల్లో 3,400 మంది సందర్శించగా, రూ. 11 లక్షల విక్రయాలు జరిగినట్లు వెల్లడించారు. వ్యవసాయ శాఖ జేడీ భాషా, అధికారులను సన్మానించిన కలెక్టర్.. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తు కార్యక్రమాలను నిర్వహిస్తూ జిల్లాను రాష్ట్రానికే ఆదర్శంగా నిలపాలని కోరారు.


